NTV Telugu Site icon

40 ఏళ్ల క్రితం మాయ‌మైన 20 ఏళ్ల అమ్మాయి… ఇప్ప‌టికీ మిస్ట‌రీగానే…

ఇప్ప‌టి వ‌ర‌కు పరిష్కారం కాని కేసులు చాలా ఉన్నాయి.  అలా పరిష్కారం కాకుండా ఉన్న కేసుల్లో ఒక‌టి సింథియా అండెర్స్ మిస్సింగ్ కేసు.  అమెరికాలోని ఒహియో రాష్ట్రంలో నివ‌శించే సింథియా త‌న కుటుంబాన్ని ఎంత‌గానో గౌరవించేది.  ముఖ్యంగా ఆమె తండ్రి  అంటే అమిత‌మైన గౌర‌వం ఉన్న‌ది.  త‌న‌కు అనేక మంది స్నేహితులు ఉన్న‌ప్ప‌టికీ, పెద్ద‌గా ఎవ‌ర్ని క‌లిసేది కాదు.  అప్పుడ‌ప్పుడు త‌న తండ్రికి తెలియ‌కుండా త‌న బాయ్‌ఫ్రెండ్ ను క‌లుస్తూ ఉండేది.  1981లో ఒహియోలోని టోలెడోలో లీగ‌ల్ సెక్రటరీగా ఉద్యోగం సంపాదించింది.  క‌ష్ట‌ప‌డి పనిచేస్తూ అన‌తి కాలంలోనే మంచి గుర్తింపు పొందింది. అయితే ఆమెకు న‌వ‌ల‌లు చ‌ద‌వ‌డం అంటే బాగా ఇష్టం.  ఖాళీ స‌మ‌యాల్లో న‌వ‌ల‌లు చ‌దువుతుండేది.  ఆఫిస్‌లోని త‌న గ‌దికి బ‌య‌ట గోడ‌పై ఓరోజు ఐ ల‌వ్యూ సిండీ బై జీ డ‌బ్ల్యూ అని రాసి ఉండ‌టం చూసింది.  ఆ త‌రువాత కొన్ని రోజుల‌కు దానిని ఎవ‌రో చెరిపివేశారు.  ఆ త‌రువాత మ‌ర‌లా అలానే రాశారు.

 1981 ఆగ‌స్ట్ 4 వ తేదీన సింథియా ఎప్పటిలాగే ఆఫీస్‌కి వ‌చ్చింది.  గ‌దిలోకి వెళ్లి లాక్ చేసుకుంది.  టేబుల్‌పై ఉన్న రేడియో ఆన్ చేసింది.  ఆ తారువాత ఏమ‌యిందో తెలియ‌దు.  మాయం అయింది.  మ‌ధ్యాహ్నం బాస్ రాబిన్స‌న్ ఆఫీస్‌కు వ‌చ్చాడు.  సింథియా రూమ్ లాక్ చేసి ఉండ‌టంతో అనుమానం వ‌చ్చి తెరిచే ప్ర‌య‌త్నం చేశాడు.  తెరుచుకోలేదు.  పోలీస్ అధికారుల స‌హాయంతో డోర్ ఓపెన్ చేశారు.  లోప‌ల సింథియా లేదు.  ఆమెకు ఇష్ట‌మైన న‌వ‌ల టెబుల్ పై ఉన్న‌ది.  అత‌ను వ‌చ్చి క‌త్తితో బెదిరించి ఎత్తుకు పోయాడు లైన్ ఉన్న పేజీ తెరిచి ఉన్న‌ది.  సింథియాకు సంబంధించిన వస్తువులన్నీ అక్క‌డే ఉన్నాయి.  కానీ, సింథియా లేదు.  ఏమ‌యిందో తెలియ‌లేదు.  అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు సింథియా కేసు మిస్టరీగానే ఉండిపోయింది.

Read: ఇప్ప‌టికీ బ‌తికే ఉన్న న్యూట‌న్ యాపిల్ చెట్టు… అదెలా సాధ్యం…

Show comments