Site icon NTV Telugu

వైర‌స్‌క‌న్నా ఈ చేప చాలా డేంజ‌ర్‌… ఎందుకంటే…

అప్పుడ‌ప్పుడు మ‌త్స్యాకారుల వ‌ల‌కు ఆరుదైన చేప‌లు దొరుకుతుంటాయి.  అలా దొరికిన అరుదైన చేప‌లను అధిక‌మొత్తానికి అమ్ముతుంటారు.  అయితే, కొన్ని ర‌కాల చేప‌లు మాత్రం భ‌య‌పెడుతుంటాయి. అవి అరుదైన చేప‌లు మాత్ర‌మే కాదు.. డేంజ‌ర్ కూడా.   విదేశాల నుంచి దేశానికి వివిధ మార్గాల ద్వారా వ‌చ్చిన అక్వేరియం చేప స‌క్క‌ర్ క్యాట్‌ఫిష్ చేప‌లు ఇప్పుడు వివిధ ప్రాంతాల్లో విస్తారంగా వ్యాపించాయి.  వేగంగా ఈ చేప‌లు వాటి సంత‌తిని పెంచుకుంటాయి.  అంతేకాదు, ఈ చేప‌ల శ‌రీరంపై న‌ల్ల‌ని చార‌లు ఉండ‌ట‌మే కాకుండా, నోటిలో ప‌దునైన ప‌ళ్లు ఉంటాయి.  ఇవి చుట్టుపక్క‌ల ఉంచే చేప‌ల‌ను గాయ‌ప‌డిచి వాటిని ఆహారంగా తీసుకుంటాయి.  చేప‌ల చెరువుల్లో ఈ చేప ఒక్క‌టి ఉంటే చాలు…నెల‌ల వ్య‌వ‌ధిలోనే దాని సంత‌తిని అపారంగా పెంచుకుంది.  చేప‌ల‌కు వేసే మేత‌ను తినేస్తుంది.  ఎలాంటి ప‌రిస్థితుల‌నైనా త‌ట్టుకొని జీవిస్తుంటాయి.  ప్ర‌తీ ఏడాది ఈ చేప‌ల కార‌ణంగా అపార‌మైన నష్టం వ‌స్తున్న‌ట్టు రైతులు వాపోతున్నారు.  ఈ చేప‌లు వైర‌స్‌ల కంటే డేంజ‌ర్ అని రైతులు ఆందోళ‌న చెందుతున్నారు.  

Read: ఆఫ్ఘ‌న్‌లో దారుణం: మరో జర్నలిస్ట్ హత్య…

Exit mobile version