NTV Telugu Site icon

Stag Beetle: దే…వుడా.. ఈ పురుగు ధర అక్షరాల రూ.75 లక్షలు!

Stag Beetle

Stag Beetle

Stag Beetle: ఒక కీటకం ధర ₹ 75 లక్షల వరకు ఉంటుందని మీకు తెలుసా? ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కీటకాలలో ‘స్టాగ్ బీటిల్’ ఒకటి. దాని ప్రత్యేకత ఏమిటి? ఒక స్టాగ్ బీటిల్ ఖరీదైనది ఎందుకంటే ఇది చాలా అరుదంటే..ఈ కీటకాలవి 1200 జాతులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. ఇంకో విషయం ఏంటంటే..కొన్ని స్టాగ్ బీటిల్ కీటకాలు చెత్తలో ఉంటాయి. ఈ పురుగు కుళ్లిన పదార్థాలు, కలపను తినేందుకు అవి ఇష్టపడతాయి. అటువంటి పురుగులకు పెద్దగా రేటు ఉండదు. కాగా.. ఎండిపోయిన చెట్ల బెరడులో జీవిస్తూ పండ్లరసం, చెట్ల ఆకుల రసం తాగే రకానికి చెందిన స్టాగ్ బీటిల్ కీటకాలకు మార్కెట్లో చాలా డిమాండ్ ఉంటుంది. అయితే.. కొన్ని సందర్భాల్లో తోటలు, పార్కులు వంటి నగర నాగరిక పరిసరాల్లోనూ జీవిస్తాయి. ఈ పురుగును ప్రమాదకర వ్యాధులకు సంబంధించిన మందుల తయారీలో ఈరకానికి చెందిన స్టాగ్ బీటిల్ కీటకాలను వాడుతుంటారు.

Read also: Assam : ఆగస్ట్ 15న అస్సాంలోని అనేక ప్రాంతాల్లో బాంబులు.. స్వాధీనం చేసుకున్న పోలీసులు

దీనికి ఇంతటి డిమాండ్ ఉండటం అనేది ఈ కీటకాల ఉనికికే ముప్పుగా తెస్తోంది. స్టాగ్ బీటిల్ పురుగు మందుల తయారీ కోసం పెద్ద ఎత్తున ఫార్మా కంపెనీలు కొనుగోలు చేస్తున్నాయి. దానివల్ల అంతరించిపోయే కీటకాల జాతుల జాబితాలో స్టాగ్ బీటిల్ కూడా చేరిపోయింది. అయితే..ఒక స్టాగ్ బీటిల్ కీటకానికి రూ.75 లక్షల దాకా రేటు వస్తుందని అంటున్నారు.అంటే ఈ కీటకం మనకు దొరికితే ఫార్మా కంపెనీకి అమ్మేసి ఎంచక్కా లైఫ్‌‌లో సెటిలై పోవచ్చన్నమాట. ఈ కీటకాలు సాధారణంగానైతే 3 నుంచి 7 సంవత్సరాలు బతుకుతాయి. ఇక..చలి అతిగా ఉన్న సీజన్లలో ఇవి సడెన్ చనిపోయే రిస్క్ కూడా ఉంటుంది కావుప.. ఈ కీటకాలకు చలి అంటే అస్సలు పడదు. ఇక..స్టాగ్ బీటిల్స్ కీటకాల తలపై 5 అంగుళాల పొడవులో నల్లటి కొమ్ములు ఉంటాయి. ఇది..మగ స్టాగ్ బీటిల్స్ సంతానోత్పత్తి సమయంలో ఆడ స్టాగ్ బీటిల్స్‌తో జత కట్టేందుకు ఈ కొండీలను పరస్పరం కొడుతూ విచిత్రమైన శబ్దాలు చేస్తాయి. ఇక..మగ స్టాగ్ బీటిల్ పురుగులు 35 నుంచి 70 మిల్లీమీటర్ల పొడవు, ఆడ స్టాగ్ బీటిల్ పురుగులు 30 నుంచి 50 మిల్లీ మీటర్ల పొడవు ఉంటాయి.
KTR: అక్కచెల్లమ్మలపై ఆ ఉద్దేశం లేదు.. కేటీఆర్‌ ట్వీట్‌ వైరల్‌..