NTV Telugu Site icon

Srikalahasti Palakova : ఒక్కసారి తింటే వ్యసనమే.. 3 గంటల్లో 300 కేజీలు అమ్మకం

Srikalahastai Palakova Special

Srikalahastai Palakova Special

Srikalahasti Palakova Food Vlog: ఆంధ్ర ప్రదేశ్ తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తి అంటే టక్కున గుర్తొచ్చేది అక్కడి శ్రీకాళహస్తీశ్వరుని ఆలయం. కానీ అక్కడికి వెళ్లిన వారికి ఎప్పటికీ గుర్తుండిపోయే అంశం మరొకటి ఉంది. అదేంటి అని అనుకుంటున్నారా? అదే పాలకోవా. అవును శ్రీకాళహస్తి కోవా రుచి చూసిన వారెవరు దాన్ని మరచిపోలేరు. శ్రీకాళహస్తి పాలకోవా ఇప్పటిది కాదండోయ్ ఏకంగా దాదాపు 7 దశాబ్దాలుగా ప్రాచుర్యంలో ఉంది. పరిసర ప్రాంతాల్లోని పాడి రైతుల నుంచి సేకరించిన పాలతో ఈ శ్రీకాళహస్తి పాలకోవా తయారుచేస్తారు. కేవలం పాలు, చక్కెరతో యంత్రాల సాయం లేకుండా చేతులతో తయారుచేసే ఈ కల్తీ లేని కోవా అంటే సామాన్యులకే కాదు ఎంతో మంది ప్రముఖులకి సైతం చాలా ఇష్టం. స్టైలిష్‌ స్టార్ అల్లు అర్జున్‌ నటించిన పుష్ప సినిమాలోనూ… శ్రీకాళహస్తి పాలకోవాపై ఓ డైలాగ్‌ వాడారు అంటే ఇదెంత ఫేమస్సో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ పాలకోవా తయారు చేసేప్పుడు ఊక బదులు వేరుశెనగ పొట్టుతో సిద్ధం చేస్తారు. అందుకే దీనికి ఇంత రుచి అని అంటారు.

War 2: ‘వార్2’ విలన్‌గా ఎన్టీఆర్.. ఆయనే ఎందుకో తెలుసా?

ఇక శ్రీకాళహస్తి చుట్టుపక్కల 43 గ్రామాలలో నేరుగా రైతుల దగ్గర నుంచే పాలను సేకరిస్తామని, ఇందులో 1000లీటర్ల పాలను కోవా, ఐస్​క్రీమ్​, భాసుంది తయారీకి ఉపయోగిస్తామని చెబుహతున్నారు. పాలకోవాను మెషిన్స్​తో కాకుండా మ్యాన్యువల్​గా తయారుచేయటం ద్వారా కోవా బాగా రుచికరంగా వస్తుందని శ్రీకాళహస్తి పాల సరఫరా సంఘం సభ్యులు చెబుతున్నారు. ఇక ఈ శ్రీకాళహస్తి పాలకోవాకు మన తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడులోనూ మంచి డిమాండ్‌ ఉంది. అందుకే ఆర్డర్స్ ను బట్టి హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై వంటి మహానగరాలకు సైతం ఈ పాలకోవాను రవాణా చేస్తున్నారు నిర్వాహకులు. ఒక్కసారి ఈ కోవా రుచి చూసినవారు మళ్లీ మళ్లీ ఆస్వాదించాలనుకుంటారని అంటున్నారు. ఒక్కసారి తింటే వ్యసనమే అని 3 గంటల్లో 300 కేజీలు అమ్మకం చేస్తామని అంటున్నారు. మరి అదేంటో మా ఎక్స్ క్లూజివ్ వీడియోలో మీరు కూడా చూసేయండి మరి.