NTV Telugu Site icon

వెరైటీ మాస్క్‌: మాస్క్‌పెట్టుకొని తినొచ్చు… తాగొచ్చు…

క‌రోనా నుంచి ర‌క్ష‌ణ పొందాలంటే త‌ప్పని స‌రిగా మాస్క్ ధ‌రించాలి. ముక్కు, నోరూ మూసే విధంగా మాస్క్‌లు అందుబాటులో ఉన్నాయి. అయితే, ఎక్కువ భాగం క‌రోనా వైర‌స్ ముక్కుద్వారానే శ్వాస‌వ్య‌వ‌స్థ‌లోకి ప్ర‌వేశిస్తుంది. దీంతో ముక్కు క‌వ‌ర్ అయ్యే విధంగా మాస్క్ ఉండాలి. ఎట్టి ప‌రిస్థితుల్లో కూడా మాస్క్‌ను తీయ‌కూడ‌దు. అయితే, తినే స‌మ‌యంలోనూ, తాగే స‌మయంలోనూ మాస్క్‌ను తీయాల్సిన అవ‌స‌రం ఉంటుంది. హోట‌ల్స్‌కు వెళ్లిన స‌మ‌యంలో మాస్క్ తీసేయ్య‌డం వ‌ల‌న క‌రోనా వ్యాప్తి చెందే అవ‌కాశం ఉంటుంది.

Read: లైవ్‌: ప్ర‌ధాని మోడీ ఇక్రిశాట్ ప‌ర్య‌ట‌న‌…

దీనిని దృష్టిలో పెట్టుకొని ద‌క్షిణ కొరియాకు చెందిన ఆత్మ‌న్ అనే సంస్థ కేవ‌లం ముక్కును మాత్ర‌మే మూసి ఉంచేలా ఓ మాస్క్‌ను రూపొందించింది. ఈ మాస్క్‌కు కోస్క్ అనే పేరు పెట్టింది. కో అంటే కొరియా భాష‌లో ముక్కు అనే అర్ధం ఉంది. దీంతో ఈ నూత‌న మాస్క్‌కు కోస్క్ అనే పేరును పెట్టారు. ఇక‌పై తినే స‌మ‌యంలోనూ, తాగే స‌మ‌యంలోనూ మాస్క్ తీయాల్సిన అవ‌స‌రం లేద‌ని ఆత్మ‌న్ సంస్థ పేర్కొన్న‌ది. ప్ర‌స్తుతం ఈ మాస్క్‌ను ఆన్‌లైన్‌లో అమ్ముతున్నారు.