Site icon NTV Telugu

వైర‌ల్‌: చిన్న ఆలూ చిప్స్‌ను రూ.14 ల‌క్ష‌ల‌కు అమ్మిన చిన్నారి…

చిన్న‌పిల్ల‌లు ఆలూ చిప్స్ ను ఇష్టంగా తింటుంటారు.  ప్ర‌తి ఇంట్లో స‌రుకుల లిస్ట్‌లో ఆలూ చిప్స్ ఉండాల్సిందే. ఆస్ట్రేలియాకు చెందిన రైలీ అనే 13 ఏళ్ల చిన్నారికి డోరిటోస్ చిప్స్ అంటే చాలా ఇష్టం.  వాటిని ఇష్టంగా తింటుంది.  అయితే, ఓ రోజు రైలీ తండ్రి ఆమెకు డోరిటోరిస్ ప్యాకెట్ కొనిచ్చారు.  దానిని ఒపెన్ చేసింది.  అందులో ఒక ఆలూ చిప్స్ చాలా అక‌ట్టుకుంది.  ఆ ముక్క బాగా ఉబ్బి స‌మోసా మాదిరిగా ఉన్న‌ది.  మొద‌ట తినాలి అనుకుంది.  కాని దానిని దాచుకుంది.  ఈ త‌రువాత దాని గురించి వివ‌రిస్తూ ఈబెలో అమ్మ‌కానికి పెట్టింది.  మొద‌ట 1 డాల‌ర్ బిడ్డింగ్‌తో అందులో ఉంచింది.  క్ర‌మంగా వీడియో ఫేస్‌బుక్ పేజీలో వైర‌ల్ కావ‌డంతో చాలా మంది పెద్ద మొత్తంలో ఇచ్చి కొనుగోలు చేసేందుకు ముందుకు వ‌చ్చారు.  ఈ విష‌యం చిప్స్ త‌యారు చేసిన డోరిటోస్ కంపెనీకి తెలిసింది.  వెంట‌నే అంద‌రికంటే ఎక్కువగా 20,100 డాల‌ర్ల‌కు ఆ చిప్‌ను సొంతం చేసుకున్నారు.  చిన్నారిలో వ్యాపారానికి సంబందించిన ల‌క్ష‌ణాలు ఉన్నాయని, పైగా ఆ కుటుంబం డోరిటోస్ చిప్స్‌ను ఇష్టంగా తింటార‌ని కంపెనీ పేర్కొన్న‌ది.  

Read: నేటి నుంచి టోక్యో పారా ఒలింపిక్స్ ప్రారంభం…

Exit mobile version