Site icon NTV Telugu

ఆ న‌ది ఒడ్డున వెండినాణేలు…ఎగ‌బ‌డిన జ‌నం…

వ‌ర్షాలు కురిస్తే కొన్ని ప్రాంతాల్లో వ‌జ్రాలు దొరుకుతుంటాయి.  కొన్ని చోట్ల లంకెబిందెలు బ‌య‌ట‌ప‌డుతుంటాయి.  అయితే, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో ఇటీవ‌లే కురిసిన భారీ వ‌ర్షాల‌కు గుణ జిల్లాల్లోని సింధ్ న‌ది పొంగిపోర్లింది.  వ‌ర్షాలు తగ్గుముఖం ప‌ట్ట‌డంతో న‌ది శాంతించింది.  వ‌ర‌ద నీరు వెనక్కి వెళ్లిన త‌రువాత న‌దీ తీరంలో వెండినాణేలు బ‌య‌ట‌ప‌డ్డాయి.  అశోక్‌న‌గ‌ర్‌లోని పంచ్‌వాలిలోని న‌దీతీరంలో ఈ నాణేలు బ‌య‌ట‌ప‌డ్డాయి.  కొంత‌మందికి పాత‌కాలం నాటి నాణేలు దొర‌క‌డంతో చుట్టుప‌క్క‌ల ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్య‌లో ప్ర‌జ‌లు అక్క‌డికి చేరుకొని నాణేల కోసం వెతుకులాట ప్రారంభించారు.  దొరికిన నాణేల‌పై బ్రిటీష్ మ‌హారాణి విక్టోరియా బొమ్మ‌లు ఉన్నాయని చెబుతున్నారు.  1860 కాలానికి చెందిన నాణేలుగా గుర్తించారు.  అయితే, ఆ ప్రాంతంలోకి నాణేలు ఎలా వ‌చ్చాయి అనే అంశంపై ప్ర‌స్తుతం అధికారులు దృష్టిసారించారు. 

Read: ఓబీసీ బిల్లుకు లోక్‌సభ ఆమోదం.. ఇకపై ఆ అధికారం రాష్ట్రాలకే

Exit mobile version