Site icon NTV Telugu

“సలార్” సెట్స్ లో శృతిహాసన్ హింస… పాపం ప్రశాంత్ నీల్

Shruthi Haasan Loves to Annoy Prashanth on Salaar Sets

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న మొదటి చిత్రం “సలార్”. ఈ సినిమా రెండవ షెడ్యూల్ హైద్రాబాద్ పూర్తి చేసిన మేకర్స్ నిన్ననే “సలార్” మూడవ షెడ్యూల్ కు సైతం ప్యాక్ అప్ చెప్పేశారు. ప్రస్తుతం ముంబైలో నాల్గవ షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న శృతి హాసన్ ఈ రోజు ముంబైలో అడుగు పెట్టింది. ఆమె తన అభిమానుల కోసం సెట్స్ నుండి ఒక చిన్న వీడియోను విడుదల చేసింది. “నా ఫేవరెట్ దర్శకులలో ఒకరైన ఫిల్మ్ మేకర్‌కి చిరాకు తెప్పించడం నా అభిరుచి” అంటూ శృతి హాసన్ ఈ వీడియోను షేర్ చేసింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు పాపం శృతి రూపంలో అందమైన అల్లరి హింసను ప్రశాంత్ నీల్ ఎలా తట్టుకుంటున్నాడో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫన్నీ వీడియో వైరల్ అవుతోంది. ప్రశాంత్ నీల్ వీడియోలో కూల్ గా సరదాగా కన్పిస్తున్నారు.

Read Also : బయటెక్కడో ఉన్నాడు… ఉండకూడదు : నాని

“సలార్” బృందం గత నెలలో హైదరాబాద్‌లో 10 రోజుల సుదీర్ఘ షెడ్యూల్‌ను ముగించింది. ఇప్పుడు మిగిలిన షెడ్యూల్ షూటింగ్ శరవేగంగా జరుపుతోంది. ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరగండూర్ నిర్మించారు. కన్నడ, తెలుగు భాషలలో ఏకకాలంలో చిత్రీకరించబడిన ఈ చిత్రం హిందీ, తమిళం, మలయాళంలో కూడా డబ్ చేయబడుతుంది. రవి బస్రూర్ సంగీతం సమకూర్చగా, సినిమాటోగ్రఫీ భువన్ గౌడ నిర్వహిస్తున్నారు. భారీ గ్యాంగ్ స్టర్ మూవీ “సలార్”లో ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రముఖ నటుడు జగపతిబాబు “సలార్”లో కీలక పాత్రలో కనిపించనున్నాడు. “సలార్” 14 ఏప్రిల్ 2022న గ్రాండ్ రిలీజ్ కానుంది.

Exit mobile version