Shot Advertisement: ‘బూతు’ యాడ్ దుమారం.. నోటీసులు జారీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ట్రెండ్, ప్యాషన్ పేర్లతో ‘అశ్లీలత’ను చూపించడం ఈమధ్య సర్వసాధారణం అయిపోయింది. యువత అదే కోరుకుంటున్నారని సాకుగా చూపిస్తూ.. వారిని పెడదారి పట్టించే అశ్లీల వీడియోల్ని తయారు చేస్తున్నారు. సాధారణ వాణిజ్య ప్రకటనల్లోనూ అదే స్ట్రాటజీని అనుసరిస్తున్నారు. వినియోగదారుల్ని, ముఖ్యంగా యువతను ఆకర్షించడం కోసం.. బూతునే నమ్ముకున్నారు. కానీ, స్వేచ్ఛ ఉంది కదా అని హద్దుమీరి వ్యవహరిస్తే, తీవ్ర పరిణామాల్నీ ఎదుర్కోవలసి వస్తుంది. ఇప్పుడో పర్ఫ్యూమ్ సంస్థ అలాగే రెచ్చిపోయి, అడ్డంగా బుక్కయ్యింది.
భారత్‌కు చెందిన ‘లేయర్స్’ అనే పర్ఫ్యూమ్, డియోడ్రంట్, స్ప్రే తయారీ సంస్థ.. తాజాగా తన ‘షాట్’ పర్ఫ్యూమ్ని ప్రమోట్ చేసేందుకు రెడీ వీడియోల్ని రూపొంచింది. అవి రెండు డబుల్ మీనింగ్‌లో ఉండటమే కాదు.. యువతుల్ని అగౌరవపరిచేలా ఉన్నాయి. ఒక వీడియోలో ఓ అమ్మాయి తన బాయ్‌ఫ్రెండ్‌తో ఉండగా, అతని స్నేహితులు హఠాత్తుగా తలుపులు బద్దలుకొట్టుకొని లోపలికి వస్తారు. వచ్చీ రాగానే ‘షాట్’ వేశావా? అంటే, ఆ అబ్బాయి అవునంటాడు. ఇంతలో ఆ నలుగురిలో ఒకతను అందుకొని, ఇప్పుడు నావంతు అని చెప్తూ షాట్ పర్ఫ్యూమ్ దిశగా వెళ్తాడు. డబుల్ మీనింగ్‌తో నిండి ఉన్న ఈ వీడియో చూడ్డానికి చాలా చెత్త భావనని కలిగిస్తుంది.
Also Read
- Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
- Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ 'జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు'.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
- Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
- Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
మరో వీడియోలో.. ఓ షాపింగ్ మాల్లో ఒక అమ్మాయి ఏదో వస్తువు తీసుకుంటుండగా, వెనకే ఉండే నలుగురు అబ్బాయి ‘మనం నలుగురం, ఇది మాత్రం ఒక్కటే, మరి షాట్ ఎవరు తీసుకుంటారు?’ అని సంభాషించుకుంటారు. అప్పుడు ఆ అమ్మాయి బెదిరిపోయి వెంటనే వాళ్ళ వైపు చూస్తుంది. అప్పుడా అబ్బాయి షాట్ పర్ఫ్యూమ్ని చూస్తున్నట్టుగా వీడియో ఉంటుంది. మొదటి వీడియో కంటే ఇది మరీ దారుణంగా ఉంది. అత్యాచార సంస్కృతిని పెంపొందించేలా ఉంది. ఇదే భావనని మహిళలు నెట్టింట్లో తెలియజేస్తూ.. వీటిని బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు. ఫిర్యాదులు అందించారు.
ఈ యాడ్స్ గురించి తెలుసుకున్న అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ASCI).. ఆ యాడ్స్‌ను తొలగించామని స్పష్టం చేసింది. అంతేకాదు, వాటిపై దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేసినట్లు ట్విటర్లో వెల్లడించింది. కాగా.. లేయర్స్ ‘షాట్’ డియోడ్రంట్ బ్రాండ్ గుజరాత్‌లోని అహ్మదాబాద్ అడ్జావిస్ వెంచర్ లిమిటెడ్‌కు చెందింది. దేవేంద్ర ఎన్ పటేల్ దీనిని స్థాపించారు.
https://twitter.com/RishitaPrusty_/status/1532632641815515136?s=20&t=wsE2QgzMxRPM0RlZ8051jA
https://twitter.com/monikamanchanda/status/1532587311019438080?s=20&t=3cZCtDKActFrzXLhI8pX8Q
తాజావార్తలు
-
‘Raaka’ Glimpse: ‘రాకా’ ఫ్యాన్స్‌కు షాక్.. ఇప్పటి వరకు ఊరించిందంతా ఉత్తిదేనా?
-
Iran Crisis: సంక్షోభంలో ఇరాన్.. బతకడానికి ‘‘జుట్టు’’ అమ్ముకుంటున్న జనాలు..
-
AP High Court: డీఎస్సీ-2025 పిల్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. రాజకీయ ప్రయోజనాలకు పిల్‌ను వాడొద్దు..!
-
Raashi Khanna: హే రాశి.. ఇప్పుడెందుకీ క్లీవేజ్ షో?
-
Sunetra Pawar: సునేత్ర పవార్‌ను ‘గూంగీ గుడియా’ అన్న కాంగ్రెస్.. దుమారం రేపుతోన్న వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!