Site icon NTV Telugu

Shot Advertisement: ‘బూతు’ యాడ్ దుమారం.. నోటీసులు జారీ!

Shot Ad Controversy

Shot Ad Controversy

ట్రెండ్, ప్యాషన్ పేర్లతో ‘అశ్లీలత’ను చూపించడం ఈమధ్య సర్వసాధారణం అయిపోయింది. యువత అదే కోరుకుంటున్నారని సాకుగా చూపిస్తూ.. వారిని పెడదారి పట్టించే అశ్లీల వీడియోల్ని తయారు చేస్తున్నారు. సాధారణ వాణిజ్య ప్రకటనల్లోనూ అదే స్ట్రాటజీని అనుసరిస్తున్నారు. వినియోగదారుల్ని, ముఖ్యంగా యువతను ఆకర్షించడం కోసం.. బూతునే నమ్ముకున్నారు. కానీ, స్వేచ్ఛ ఉంది కదా అని హద్దుమీరి వ్యవహరిస్తే, తీవ్ర పరిణామాల్నీ ఎదుర్కోవలసి వస్తుంది. ఇప్పుడో పర్ఫ్యూమ్ సంస్థ అలాగే రెచ్చిపోయి, అడ్డంగా బుక్కయ్యింది.

భారత్‌కు చెందిన ‘లేయర్స్’ అనే పర్ఫ్యూమ్, డియోడ్రంట్, స్ప్రే తయారీ సంస్థ.. తాజాగా తన ‘షాట్’ పర్ఫ్యూమ్‌ని ప్రమోట్ చేసేందుకు రెడీ వీడియోల్ని రూపొంచింది. అవి రెండు డబుల్ మీనింగ్‌లో ఉండటమే కాదు.. యువతుల్ని అగౌరవపరిచేలా ఉన్నాయి. ఒక వీడియోలో ఓ అమ్మాయి తన బాయ్‌ఫ్రెండ్‌తో ఉండగా, అతని స్నేహితులు హఠాత్తుగా తలుపులు బద్దలుకొట్టుకొని లోపలికి వస్తారు. వచ్చీ రాగానే ‘షాట్’ వేశావా? అంటే, ఆ అబ్బాయి అవునంటాడు. ఇంతలో ఆ నలుగురిలో ఒకతను అందుకొని, ఇప్పుడు నావంతు అని చెప్తూ షాట్ పర్ఫ్యూమ్ దిశగా వెళ్తాడు. డబుల్ మీనింగ్‌తో నిండి ఉన్న ఈ వీడియో చూడ్డానికి చాలా చెత్త భావనని కలిగిస్తుంది.

మరో వీడియోలో.. ఓ షాపింగ్ మాల్‌లో ఒక అమ్మాయి ఏదో వస్తువు తీసుకుంటుండగా, వెనకే ఉండే నలుగురు అబ్బాయి ‘మనం నలుగురం, ఇది మాత్రం ఒక్కటే, మరి షాట్ ఎవరు తీసుకుంటారు?’ అని సంభాషించుకుంటారు. అప్పుడు ఆ అమ్మాయి బెదిరిపోయి వెంటనే వాళ్ళ వైపు చూస్తుంది. అప్పుడా అబ్బాయి షాట్ పర్ఫ్యూమ్‌ని చూస్తున్నట్టుగా వీడియో ఉంటుంది. మొదటి వీడియో కంటే ఇది మరీ దారుణంగా ఉంది. అత్యాచార సంస్కృతిని పెంపొందించేలా ఉంది. ఇదే భావనని మహిళలు నెట్టింట్లో తెలియజేస్తూ.. వీటిని బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు. ఫిర్యాదులు అందించారు.

ఈ యాడ్స్ గురించి తెలుసుకున్న అడ్వర్‌టైజింగ్‌ స్టాండర్డ్స్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (ASCI).. ఆ యాడ్స్‌ను తొలగించామని స్పష్టం చేసింది. అంతేకాదు, వాటిపై దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేసినట్లు ట్విటర్‌లో వెల్లడించింది. కాగా.. లేయర్స్‌ ‘షాట్‌’ డియోడ్రంట్‌ బ్రాండ్‌ గుజరాత్‌‌లోని అహ్మదాబాద్‌ అడ్జావిస్‌ వెంచర్‌ లిమిటెడ్‌కు చెందింది. దేవేంద్ర ఎన్‌ పటేల్‌ దీనిని స్థాపించారు.

https://twitter.com/RishitaPrusty_/status/1532632641815515136?s=20&t=wsE2QgzMxRPM0RlZ8051jA

https://twitter.com/monikamanchanda/status/1532587311019438080?s=20&t=3cZCtDKActFrzXLhI8pX8Q

Exit mobile version