ప్రపంచంలో ఇప్పటికే 700 కోట్ల మందికి పైగా జనాభా ఉన్నది. ఎక్కువ జనాభా ఆసియా దేశాల్లోనే ఉండటం విశేషం. ప్రస్తుతం ఉన్న జనాభాకు కావాల్సిన మౌళిక వసతులు, ఆహారం, ఉద్యోగాల కల్పన సరిగా అందక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే, ప్రజల జీవన విధానంలో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. పిల్లల్ని కనడంపై కంటే, కెరీర్‌పైనే ప్రజలు ఎక్కువగా దృష్టిసారించారు. దీంతో అనేక దేశాల్లో జననాల సంఖ్య క్రమంగా తగ్గిపోతున్నది. కరోనా మహమ్మారి ప్రభావం కూడా జననాల సంఖ్యపై పడింది. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశమైన చైనాలో ఇద్దరు కాదు ముగ్గుర్ని కనమని చెబుతున్నారు. అయినప్పటికి అక్కడి ప్రజలు ఒక్కరు కంటే ఎక్కవ మందిని కనేందుకు ఆసక్తి చూపడంలేదు. తాజాగా మసాచుసెట్స్ విశ్వవిద్యాలయం పరిశోధకులు జనాభా పెరుగుదలపై పరిశోధనలు చేశారు. ఈ పరిశోధనలో షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి. 2064 వరకు ప్రపంచంలోని జనాభా గరిష్టానికి చేరుకుంటుందని, ఆ తరువాత క్రమంగా తగ్గుతూ ఈ శతాబ్దం చివరినాటికి జనాభా సంఖ్య 50 శాతం తగ్గిపోతుందని అంచనా వేస్తున్నారు. పెరుగుతున్న ఒత్తిడి పునరుత్పత్తి సామర్థ్యంపై ప్రభావం చూపుతుందని పరిశోధకులు చెబుతున్నారు.
Read: ఇందిరాపార్క్ వద్ద కలకలం సృష్టించిన ఫ్లెక్సీ… వారికి ప్రవేశం లేదు…
