ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సలార్ మేనియా కొనసాగుతుంది.. సినిమా విడుదలై వారం రోజులు అవుతున్నా కూడా క్రేజ్ అసలు తగ్గలేదు.. సినిమా హిట్ టాక్ ను అందుకోవడంతో పాటుగా ప్రభాస్ ను ఎన్నో ఏళ్లుగా యాక్షన్ మోడ్ లో చూడాలనుకున్న ఫ్యాన్స్ కు దర్శకుడు ప్రశాంత్ నీల్ ఫుల్ మీల్స్ అందించారు. డార్లింగ్ కు ఇచ్చిన ఎలివేషన్స్, యాక్షన్ సీక్వెన్స్ లకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.. డైరెక్టర్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు..
ఇటు తెలుగు రాష్ట్రాలు, నార్త్, సౌత్, ఓవర్సీస్ లోనూ ప్రస్తుతం సలార్ క్రేజే కనిపిస్తోంది. ముఖ్యంగా నేపాల్ లో ‘సలార్’ కోసం ఫ్యాన్స్, ఆడియెన్స్ థియేటర్ల వద్ద బారులు తీరారు.. టికెట్లను కొనడానికి కౌంటర్ల వద్ద క్యూ లో వెయిట్ చేస్తున్నారు.. అంటేనే అర్థమవుతుంది సలార్ క్రేజ్ అక్కడ ఎలా ఉందో.. గత రోజులను గుర్తు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. నేపాల్ లో సినిమా హాళ్ల ముందు ఆడియెన్స్, ఫ్యాన్స్ హంగామా చూసిన డార్లింగ్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు..
ఈ చిత్రం నాలుగు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ.402 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక రెండో వీకెండ్ పూర్తి చేసే వరకు భారీ మార్క్ ను చేరుకుంటుందని అంటున్నారు. సలార్ సీజ్ ఫైజ్ మొదటి పార్ట్ కాగా, సలార్ శౌర్యాంగ పర్వం రెండో భాగంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. సెకండ్ పార్ట్ ప్రభాస్ మరింత వైల్డ్ గా కనిపించనున్నారని ఓ ఇంటర్వ్యూ లో టీమ్ చెప్పుకొచ్చారు.. ఈ సినిమా హీరోయిన్ గా శృతి హాసన్ నటించింది.. పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు, బ్రహ్మాజీ, శ్రియా రెడ్డి, యాంకర్ ఝాన్సీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. హోంబలే ఫిల్మ్స్ నిర్మించింది..
Nepal #Salaar 🔥🔥 pic.twitter.com/H6bHTLE2E9
— Teja (@tejarebel10) December 26, 2023