మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నిన్న యాక్సిడెంట్ కు గురైన విషయం తెలిసిందే. హైదరాబాద్, మాదాపూర్ లో ఉన్న కేబుల్ బ్రిడ్జి పై స్పోర్ట్స్ బైక్ లో ప్రయాణిస్తూ అదుపు తప్పి కింద పడిపోయాడు తేజ్. యాక్సిడెంట్ లో తీవ్రగాయాల పాలైన సాయి ధరమ్ తేజ్ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. దీంతో వెంటనే దగ్గరలోని మెడికవర్ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం ఆయనను అపోలో ఆస్పత్రికి తరలించారు. ఆయనను పరీక్షించిన అపోలో హాస్పిటల్ వైద్యులు సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం బాగానే ఉన్నాడు అని వెల్లడించారు. ర్యాష్ డ్రైవింగ్, అధిక వేగం కారణంగానే యాక్సిడెంట్ జరిగిందని నిర్ధారించిన పోలీసులు సాయి ధరమ్ తేజ్ పై ఐపీసీ 336, 184 ఎంవి యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.
Read Also : సాయి ధరమ్ తేజ్ బైక్ ప్రత్యేకతలు ఇవే..
ఇక సాయి ధరంతేజ్ నడిపించిన బైక్ ఆయనది కాదని తెలుస్తోంది. ఈ బైక్ అనిల్ కుమార్ బుర్రా రిజిస్టర్ అయి ఉండడం గమనార్హం. సాయిధరమ్ తేజ వాడిన స్పోర్ట్స్ బైక్ ట్రంప్ చాలా ఖరీదైనది. 1160 సి సి ట్రిపుల్ ఇంజన్ కలిగిన ఈ బైక్ ధర రూ.18 లక్షలు. ఇక ఈ బైక్ పై గతంలోనే ఓవర్ స్పీడ్ కారణంగా చాలా చలాన్లు ఉన్నాయి. చివరగా 2020 ఆగస్టు 2న ఓవర్ స్పీడ్ కారణంగా ఈ బైక్ కు చలాన్ పడినట్లు తెలుస్తోంది.
