ఇటీవల కాలంలో మూగజీవాలపై దాడులు ఎక్కువ అవుతున్నాయి. గతంలో ఓ కుక్కను కట్టేసి కొట్టి చంపిన వీడియో వైరల్ కాగా సోషల్ మీడియాలో ఓ పెద్ద ఉద్యమమే సాగింది. వారిని అరెస్ట్ చేయాలంటూ నెటిజన్లు పెద్ద ఎత్తున తమ స్వరం విన్పించారు. ఆ తరువాత వాళ్ళు మైనర్లు అని తేలింది. అయితే మూగజీవాలను మరీ అంతలా ఎలా హింసిస్తారు? అసలు వాటిని ఇలా ఎందుకు బాధ పెడుతున్నారు అంటూ జంతు ప్రేమికులు ఫైర్ అవుతున్నారు. తాజాగా ఇలాంటి సంఘటనకు సంబంధించి మరో అమానవీయ ఘటన వెలుగులోకి రాగా, ఆ వీడియోపై రష్మీ ఆవేదన వ్యక్తం చేసింది.
Read Also : సంక్రాంతి బరిలో “సర్కారు వారి పాట” లేనట్టే ?
మధ్యప్రదేశ్ లోని దివాస్ లో మున్సిపల్ కార్పొరేషన్ కు చెందిన ఇద్దరు ఉద్యోగులు ఓ వీధి కుక్కను తాడుతో కట్టేసి, దాదాపు 30 నిమిషాల పాటు కొట్టి చంపారు. ఆ సమయంలో తీసిన వీడియోను ఓ నెటిజన్ షేర్ చేస్తూ యాంకర్ రష్మిని ట్యాగ్ చేశారు. ఆ వీడియో చూసి కలత చెందిన రష్మీ ‘ఈ అమానుషాన్ని మానవత్వం లేని మనుషులు చూస్తూ ఉండిపోయారన్న మాట. మనకు భూమ్మీద ఉండే అర్హత లేదు. మానవజాతి తుడిచి పెట్టుకుపోయే సమయం ఇది” అంటూ ఏడుస్తున్న ఎమోజీని పోస్ట్ చేశారు.