సంక్రాంతి బరిలో “సర్కారు వారి పాట” లేనట్టే ?

సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ “సర్కారు వారి పాట”. మైత్రి మూవీ మేకర్స్, జిఎంబి ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లు సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తుండగా, థమన్ సౌండ్‌ట్రాక్ కంపోజ్ చేస్తున్నాడు. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా తాజా షెడ్యూల్ ప్రస్తుతం స్పెయిన్ లో జరుగుతోంది. అద్భుతమైన యూరోపియన్ దేశంలో యాక్షన్-ప్యాక్డ్ సీక్వెన్స్‌ని యూనిట్ చిత్రీకరిస్తోంది. ఒకవైపు సినిమా చిత్రీకరణ జరుగుతుంటే మరోవైపు సినిమాపై పలు క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో ఒకటి సినిమాలో మహేష్ అవతార్ గురించి. రెండవది సినిమా రిలీజ్ డేట్ గురించి. క్రేజ్ బజ్ ప్రకారం పరశురామ్ డైరెక్షన్‌లో మహేష్ ఇంతకు ముందెన్నడూ చూడని అవతార్‌ లో కనిపించనున్నాడట.

Read Also : “ఆర్ఆర్ఆర్” కోసం ఆ పని కంప్లీట్ చేసిన స్టార్స్

మొదటిసారి అలా… !
“సర్కారు వారి పాట” ఇంటర్వెల్ సీక్వెన్స్ సింహాచలం టెంపుల్ బ్యాక్‌డ్రాప్‌లో సెట్ చేశారట. ఈ క్రమంలో సినిమాలో విలన్ గా నటిస్తున్న సముద్రకనికి మహేష్ నరసింహుడిగా కనిపించబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. ఈ దృశ్యం సినిమాలోనే ప్రధాన హైలైట్‌ అంటున్నారు. ఇంకా సినిమా క్లైమాక్స్ కూడా సింహాచలం దేవాలయంలోనే ఉంటుందని సమాచారం. మహేష్ తన కెరీర్‌లో ఇప్పటి వరకు ఒక పౌరాణిక పాత్రలు చేయలేదు. ఇదే గనుక నిజమైతే సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు పండగే. అయితే ఇందులో నిజం ఎంతో తెలియాలంటే సినిమా విడుదలయ్యే వరకు ఎదురు చూడాల్సిందే.

Read Also : సాయి పల్లవి షాకింగ్ డెసిషన్ !

రిలీజ్ డేట్ డైలమా
‘సర్కారు వారి పాట’ను సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల చేస్తామని ప్రకటించారు మేకర్స్. అయితే సినిమా ఆ సమయంలో విడుదల కాదని, పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. సంక్రాంతి రేసులో గంపగుత్తగా ఆర్ఆర్ఆర్, భీమ్లా నాయక్, రాధే శ్యామ్ వంటి సినిమాలన్నీ విడుదల అవుతున్నాయి. ఇన్ని సినిమాలు ఒకేసారి విడుదల అయితే ప్రేక్షకులకు కూడా కష్టం. పైగా అన్ని సినిమాలలో ఒక సినిమాగా విడుదల అయితే కిక్కేముంది అనుకున్నారో ఏమో మేకర్స్… సినిమా విడుదల తేదీపై మరోసారి దృష్టి పెట్టినట్టు సమాచారం. సన్నిహిత వర్గాల అప్డేట్ ప్రకారం “సర్కారు వారి పాట” చిత్రాన్ని విడుదల చేయడానికి ఏప్రిల్ 29వ తేదీని పరిశీలిస్తున్నారట మేకర్స్.

-Advertisement-సంక్రాంతి బరిలో "సర్కారు వారి పాట" లేనట్టే ?

Related Articles

Latest Articles