Site icon NTV Telugu

Ram Charan: రామ్ చరణ్‌ కూతురిని చూశారా?.. వైరల్ అవుతున్న ఫోటో..

Ram Charam Family Picture

Ram Charam Family Picture

మెగా పవర్ స్టార్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు ఈ మధ్యే తల్లి, దండ్రులు అయ్యారు.. వీరికి పాప పుట్టింది.. పదేళ్ల తర్వాత పాప పుట్టింది.. మెగా కాంపౌండ్ లో వారసురాలు ఎంట్రీతో ఆనందానికి అవధులు లేకుండా పోయింది.. ఇక మనవరాలి రాకతో చిరంజీవి- సురేఖ సంబరాల్లో మునిగిపోయారు అభిమానులు కూడా మెగా ప్రిన్సెస్‌ రాకను ఓ పండగలా సెలబ్రేట్‌ చేసుకున్నారు. ఆ తర్వాత వేడుకగా బారసాల జరిపి మెగా ప్రిన్సెస్‌కు క్లింకార కొణిదెల అని నామకరణం చేశారు రామ్‌ చరణ్‌- దంపతులు. కాగా చాలామంది సెలబ్రిటీల్లాగే ఉపాసన దంపతులు తమ కూతురి విషయంలో ఎంతో గోప్యత పాటిస్తున్నారు. అందుకే తమ లిటిల్‌ ప్రిన్స్‌ ముఖాన్ని ఇంతవరకు చూపించలేదు..

ఇక మెగా ప్రిన్స్ ఎవరి లాగా ఉంటుందో అని చరణ్ ఫ్యాన్స్ తో పాటు, మెగా ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. రామ్ చరణ్ దంపతులు కూడా తమ కూతురు విషయంలో ఎటువంటి విషయాన్ని బయట పెట్టడం లేదు.. అయితే ఈ క్రమంలో క్లింకార ఫోటో ఇదిగో ఇదే అంటూ ఓ ఫోటో నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది..అయితే ఇవి రియల్‌ ఫొటోలు కాదు. ఆర్టీఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సహకారంతో కొందరు క్లింకార ఫొటోలను అద్బుతంగా డిజైన్‌ చేస్తున్నారు. అలా రామ్‌ చరణ్‌ చేతుల్లో బేబీ ఉన్న ఏఐ ఫొటో ఒకటి నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటోంది.. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి..

కాగా, రామ్‌ చరణ్‌- ఉపాసన దంపతులు ప్రస్తుతం ఇటలీకి వెళ్లారు. తమ కూతురు క్లింకార కొణిదెలతోపాటు.. చరణ్ పెట్ డాగ్‌ రైమ్‏ను తీసుకొని వెళ్తూ హైదరాబాద్ ఎయిర్ పోర్టులో కనిపించారు. మెగా హీరో వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠీ పెళ్లి పనుల కోసం వీరు ఇటలీ చేరుకున్నారు. వరుణ్ పెళ్లి పనులను రామ్‌ చరణ్‌ దంపతులు దగ్గరుండి చూసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక సినిమాల విషయానికొస్తే.. రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్‌ ఛేంజర్‌ అనే లో నటిస్తున్నారు. క్రియేటివ్‌ డైరెక్టర్‌ శంకర్‌ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది..

Exit mobile version