Site icon NTV Telugu

నిక్ ‘చిరుతిండి’గా మారిన ప్రియాంక… పిక్ వైరల్

Priyanka Chopra Jonas shares a latest click with Nick

గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఏం చేసినా చిటికెలో వైరల్ అవుతుంది. తాజాగా అలాగే ఆమె షేర్ చేసిన పిక్ ఒకటి నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఒక పిక్ లో బికినీ ధరించిన ప్రియాంక మరో పిక్ లో తన భర్త చేస్తున్న చిలిపి చేష్టలను పంచుకుంది. ఈ జంటను అభిమానులు నిక్యామ్కా అన్ని పిలుచుకుంటారు.

Read Also : టోక్యో పారాలింపిక్స్‌లో భారత్ హవా… అథ్లెట్లకు సెలెబ్రిటీల సెల్యూట్

ప్రియాంకా చోప్రా తన నెక్స్ట్ వెబ్ సిరీస్ ‘సిటాడెల్’ కోసం లండన్‌లో కొన్ని వారాల పాటు షూటింగ్ లో పాల్గొంది. కొంత గ్యాప్ తరువాత ఆమె తన భర్త, సింగర్ నిక్ జోనస్‌తో తిరిగి కనిపిస్తోంది. ప్రియాంక సోమవారం తన ఇన్‌స్టాగ్రామ్‌లోకి నిక్ తో ఉన్న ఆసక్తికర ఫోటోలను షేర్ చేసింది. మొదటిది ఫోటోలో ప్రియాంక కుర్చీ పడుకుని నిక్ ఫోర్క్, కత్తిని ఉపయోగిస్తూ తింటున్నట్టు కన్పిస్తోంది. ప్రియాంక ఈ ఫోటోకు “చిరుతిండి (స్నాక్)” అని క్యాప్షన్ ఇచ్చింది. రెండవ సెల్ఫీలో నలుపు, ఎరుపు బికినీలో ప్రియాంక కళ్ళు చెదిరేలా కనిపించింది. ఈ పిక్ కు “ఆదివారాలు ఇలాగ” అని క్యాప్షన్ ఇచ్చింది. మొత్తానికి ఆ పిక్ తో ఇంటర్నెట్ లో సంచలనం సృష్టిస్తోంది ప్రియాంక.

View this post on Instagram

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra)

ప్రస్తుతం ప్రియాంక వెబ్ సిరీస్ ‘సిటాడెల్’ కోసం లండన్‌లో జరుగుతున్న షూటింగ్ లో పాల్గొంటోంది. ఇది రస్సో బ్రదర్స్ దర్శకత్వం వహిస్తున్న స్పై-థ్రిల్లర్. ఇందులో ప్రియాంక, ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ ఫేమ్ నటుడు రిచర్డ్ మాడెన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఆమె ఇటీవల న్యూయార్క్‌లో సోనా అనే భారతీయ రెస్టారెంట్‌ను ప్రారంభించింది. ప్రియాంక నెక్స్ట్ ‘టెక్స్ట్ ఫర్ యు’లో కనిపించనుంది. అంతే కాకుండా ఆమె ‘మ్యాట్రిక్స్ 4’, ఇటీవల ప్రకటించిన బాలీవుడ్ చిత్రం ‘జీ లే జరా’లో కూడా నటిస్తోంది.

View this post on Instagram

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra)

Exit mobile version