పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఆయన అంటే యువత పడి చచ్చిపోతారు.. పవన్ మాటే వేదం.. పవన్ బాటే సన్మార్గం అని చాలా మంది యువత భావిస్తారు.. ఒకవైపు సినిమాలు.. మరో వైపు రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉన్నాడు పవన్ కళ్యాణ్.. అయితే సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ తన అప్డేట్స్ ఇస్తున్న పవన్ ఈసారి ఇంస్టాగ్రామ్ లో ఆసక్తి కర పోస్ట్ చేశాడు.. ఆ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
సాదారణంగా ట్విట్టర్‌లో రాజకీయాలకు సంబంధించి యాక్టివ్‌గా ఉండే పవన్ ఇటీవల కొన్నాళ్ళ క్రితం ఇన్‌స్టాగ్రామ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. పవన్ కి ఇన్‌స్టాగ్రామ్‌లో 2.8 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.
ట్విట్టర్ లో రెగ్యులర్ గా రాజకీయాల గురించి పోస్టులు పెట్టే పవన్ ఇన్‌స్టాగ్రామ్ లో మాత్రం చాలా రేర్ గా ఆసక్తికర పోస్టులు మాత్రమే పెడుతున్నారు. రెండు వారాల క్రితం మోడీ సభ గురించి పోస్ట్ పెట్టిన పవన్ తాజాగా ఓ కుక్క గురించి పోస్ట్ చేశారు.. ఆ పోస్ట్ ను ఆయన ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు..
పవన్ బేగంపేట్ ఎయిర్ పోర్ట్ లో ఉన్న ఓ పోలీస్ కుక్కను బుజ్జగించాడు.. అందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.. అదే ప్రస్తుతం వైరల్ అవుతుంది.. నేను బేగంపేట ఎయిర్ పోర్ట్ లో నా ఫ్లైట్ ఎక్కేందుకు ఎదురుచూస్తుండగా నా కోసం ఓ సర్‌ప్రైజ్ విజిటర్ వచ్చాడు. అతను ఎవరో కాదు పోలీస్ డాగ్ స్క్వాడ్ లో ఉండే బిందు అనే కుక్క. అది నాతో చాలా స్నేహంగా ఉంది. తన తోకని ఆసక్తిగా ఊపింది. తను నాలో ఉత్సాహం నింపింది. నేను విమానం ఎక్కేముందు ఓ అనుకోని అందమైన అనుభూతిని ఇచ్చింది అంటూ ఆసక్తికరంగా పోస్ట్ చేశాడు. దీంతో పవన్ కళ్యాణ్ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది.. పవర్ స్టార్ ఫ్యాన్స్, నెటిజన్లు ఆ వీడియోను చూసి ఫిదా అవుతున్నారు.. సినిమాల విషయానికొస్తే.. మూడు సినిమాల్లో నటిస్తున్నారు..