NTV Telugu Site icon

వేలానికి గ్ర‌హాంత‌ర వ‌జ్రం… ప్రారంభ ధ‌ర ఎంతంటే…

భూమిపై విలువైన వాటిల్లో వ‌జ్రం కూడా ఒక‌టి.  భూమిలో ప్ర‌త్యేక ప‌రిస్థితుల్లో క‌ర్భ‌న స‌మ్మేళ‌నాల క‌ల‌యిక ద్వారా వ‌జ్రాలు ఏర్ప‌డ‌తాయి.  అయితే, టెక్నాల‌జీ అందుబాటులోకి వ‌చ్చిన త‌రువాత కృత్రిమంగా ల్యాబ్‌ల‌లో వ‌జ్రాల‌ను త‌యారు చేస్తున్నారు.  వ‌జ్రాలు అనేక రంగుల్లో దొరుకుతుంటాయి.  వాటిల్లో బ్లాక్ వ‌జ్రాలు చాలా అరుదైన‌వి.  అరుదైన వాతార‌వ‌ణ ప‌రిస్థితుల్లో ఈ వ‌జ్రాలు ఏర్ప‌డుతుంటాయి.  ఇక ఇదిలా ఉంటే ప్ర‌ముఖ వ‌జ్రాల వేలం సంస్థ సోత్‌బే  ఖ‌గోళానికి చెందిన ఓ వ‌జ్రాన్ని వేలం వేయ‌బోతున్న‌ది.  ఫిబ్ర‌వ‌రి 2022లో లండ‌న్‌లో వేలం వేయ‌బోతున్నారు. గ్ర‌హ‌శ‌క‌లాలు భూమిని తాకిన‌పుడు ప్ర‌త్యేక వాతావ‌ర‌ణ ప‌రిస్థితులు ఏర్ప‌డి ఆ త‌ర‌వాత వాతావ‌ర‌ణం చ‌ల్ల‌బ‌డటం వ‌ల‌న ఇలాంటి వ‌జ్రాలు ఏర్పడుతుంటాయి.  

Read: పంజాబ్ ఆప్ ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థిగా ప్ర‌జ‌లు ఎవ‌ర్ని ఎన్నుకున్నారంటే…

ఈ వ‌జ్రాల‌ను ఎనిగ్మా అని పిలుస్తారు.  555.55 క్యారెట్ల బ‌రువైన ఈ వ‌జ్రం 55 ముఖాల‌ను క‌లిగి ఉంది.  కార్బోనాడోగా పిల‌వ‌బ‌డే ఈ న‌ల్ల‌ని వ‌జ్రాలు బ్రెజిల్‌, ఆఫ్రికాలో మాత్ర‌మే అరుదుగా దొరుకుతుంటాయి.  ఎనిగ్మా వ‌జ్రం ప్రారంభ ధ‌ర రూ. 50 కోట్ల రూపాయ‌లుగా ఉంటుంద‌ని వేలం నిర్వ‌హ‌ణ సంస్థ సోత్‌బే తెలియ‌జేసింది.