Site icon NTV Telugu

క‌ర్ణాట‌క‌లో రూపాయికే భోజ‌నం…

రూపాయికి ఏమోస్తుంది అంటే చెప్ప‌డం క‌ష్ట‌మే.  అలాంటిది రూపాయికే భోజ‌నం దొరుకుంది అంటే అంత‌కంటే కావాల్సినంది ఎముంటుంది.  క‌ర్ణాట‌కలోని జైన్ యువ‌క మండ‌లి రూపాయికే భోజ‌నాన్ని అందించేందుకు ముందుకు వ‌చ్చింది.  పేద‌ల కోసం ఈ భోజ‌న ప‌థ‌కాన్ని ప్ర‌వేశ‌పెట్టింది.  బ‌ళ్లారి న‌గ‌రంలోని జైన్ దేవాల‌యం వ‌ద్ద ఈ కార్య‌క్ర‌మాన్ని ఎమ్మెల్యే గాలి సోమ‌శేఖ‌ర్ రెడ్డి ప్రారంభించారు.  రూపాయికి రొట్టె, అన్నం, సాంబార్ లేదా చిత్రాన్నంను అందిస్తామ‌ని జైన్ యువ‌క మండ‌లి పేర్కొన్న‌ది.  న‌గ‌రంలోని ఓపీడీ ఆసుప‌త్రి, జిల్లా ఆసుప‌త్రి, ప్రైవేట్‌, ప్ర‌భుత్వ బ‌స్టాండ్ల వ‌ద్ద భోజ‌నానికి సంబందించిన వాహానాల‌ను ఉంచి పేద‌ల‌కు రూపాయికి భోజ‌నం అందిస్తామ‌ని మండ‌లి స‌భ్యులు తెలిపారు.  

Read: సాధారణ కూలి ఇంటికి లక్షల్లో కరెంట్ బిల్‌… అదేంటని అడిగితే…!!

Exit mobile version