మేకలు ఆకులు మాత్రమే తింటాయి అన్నది పాత మాట. ఈ మేక వెరీ స్పెషల్. ఇది ఆకులనే కాకుండా చేపలను కూడా లాగించేస్తోంది. ప్లేటులో ఉంచిన చేపలను కరకర నమిలి మింగేసింది. ఆకులు తినితిని బోర్ కొట్టిందేమో ఇలా చేపలను తింటోంది ఆ మేక. దీనికి సంబందించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, ఒక్కసారిగా వైరల్ అయింది. ఆకులు అలమలు తినే మేకలోనే అన్ని రకాల పోషక పదార్ధాలు ఉంటే, చేపలను తినే మేకలో ఇంకెన్ని పోషకపదార్ధాలు ఉంటాయో అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి ఈ నాన్ వెజ్ మేక సోషల్ మీడియాను ప్రస్తుతం దున్నేస్తున్నది.
Read: “కిస్ మీ మోర్” అంటూ దిశా అట్రాక్టివ్ స్టెప్స్… వీడియో వైరల్
