Site icon NTV Telugu

భార‌త్‌లో మ‌రో కొత్త క‌ల్చ‌ర్‌… ఇక‌పై వారానికొక‌సారి…

క‌రోనా కార‌ణంగా ప్ర‌పంచంలోని అనేక దేశాల్లో వ‌ర్క్ కల్చ‌ర్ పూర్తిగా మారిపోయింది. ఆఫీస్‌కు వ‌చ్చి ప‌నిచేసేవారు చేస్తున్నారు. ఇంటినుంచి ప‌నిచేసే వారు ఇంటి నుంచి ప‌నిచేస్తున్నారు. ఇక జీతాల విష‌యాల్లో కూడా మార్పులు వ‌స్తున్నాయి. గ‌తంలో నెల‌కు ఒక‌మారు జీతాలు ఇచ్చేవారు. అయితే, ఇప్పుడు నెల‌వారీ జీతాల విధానాల‌కు స్వ‌స్తి ప‌లికి వారం వారం జీతాలు ఇచ్చే క‌ల్చ‌ర్‌కు తెర‌తీశారు. ఇప్ప‌టికే అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, హాంకాంగ్ వంటి దేశాల్లో వివిధ సంస్థ‌లు ఉద్యోగుల‌కు వారం వారం జీతాలు చెల్లిస్తున్నారు.

Read: వైర‌ల్‌: యూపీలో ఏనుగుకు జ‌న్మ‌దిన వేడుక‌లు… ఫారెస్ట్ అధికారుల సంబ‌రాలు…

ఇదే కల్చ‌ర్ ఇప్పుడు ఇండియాలో కూడా మొద‌లైంది. ఈ కామ‌ర్స్ దిగ్గ‌జం ఇండియా మార్ట్ సంస్థ ఇక‌పై వారంవారం జీతాలు ఇవ్వాల‌ని నిర్ణ‌యించింది. ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియా ద్వారా ప్ర‌క‌టించింది. వారానికి ఒక‌సారి జీతాలు చెల్లించ‌డం ద్వారా ఉద్యోగుల‌కు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు త‌లెత్త‌వ‌ని, ప్రొక్ట‌విటీ కూడా పెరుగుతుంద‌ని ఇండియా మార్ట్ ప్ర‌క‌టించింది.

Exit mobile version