NTV Telugu Site icon

Nayanthara : జై శ్రీరామ్ అంటు నయనతార లేఖ..ఏం జరిగిందంటే?

Nayanataraaa

Nayanataraaa

లేడీ బాస్ నయనతార ఈమధ్య ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసేందుకు ఇష్టపడుతుంది. ఈ నేపథ్యంలోనే వచ్చిన మూవీ.. ‘అన్నపూరణి’… ప్రముఖ దర్శకుడు నీలేశ్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా గతేడాది డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే.. సినిమా విడుదల సమయంలో చెన్నైలో వరదలు రావడం వల్ల ‘అన్న పూరణి’ మూవీపై ఎలాంటి టాక్ రాలేదు.. సైలెంట్ గా వచ్చింది.. కాస్త వివాదాలను అందుకొని సైలెంట్ గానే వెళ్ళిపోయింది..

అయితే.. ఈ సినిమా పై రోజు రోజుకు వివాదాలు ఎక్కువ అయ్యాయి.. జీవితంలో ఒక లక్ష్యం.. పట్టుదల ఉంటే ఎలాంటి అవాంతరాలనైనా దాటుకుని అనుకున్నది సాధించవచ్చనే ఉద్దేశ్యంతో’ ఈ మూవీ తెరకెక్కించారు. కానీ, డైరెక్టర్ అనుకున్నది ఒకటి జరుగుతుంది ఒకటి అన్నట్లు అయింది. ఈ మూవీలో సనాతన బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చిన యువతిని అలా చూపించడం పట్ల విమర్శలు వస్తున్నాయి. ఇందులో హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ఉన్నాయని కొందరు ఈ సినిమాపై కేసు కూడా పెట్టారు.. నెట్‌ఫ్లిక్స్ గత వారం తన ప్లాట్‌ఫారమ్ నుండి సినిమాను తొలగించింది..

ఇదిలా ఉండగా.. ఈ సినిమాలో ఏ వర్గాన్నీ కించపరిచే ఉద్దేశ్యంతో తెరకెక్కలేదని ఎవరి మనోభావాలు అయినా దెబ్బతింటే క్షమించండి…అంటూ ఆ సినిమా నిర్మాణ సంస్థ పేర్కొంది. అయినా కూడా సినిమాపై వ్యతిరేకత తగ్గలేదు. ఈ నేపథ్యంలోనే నయనతార ఓ లేఖ రాసింది.. ఆ లేఖలో జై శ్రీరామ్’ హిందూ మత చిహ్నం ‘ఓం’ అని రాసి మాస్ట్ హెడ్‌పై తన క్షమాపణలు చెప్పింది. నయనతార తన పోస్ట్‌లో, ‘సానుకూల సందేశాన్ని పంచుకోవడానికి మా నిజాయితీ ప్రయత్నంలో, మేము తెలియకుండా తప్పు చేసాము.. ఈ సమస్య తీవ్రతను అర్థం చేసుకున్నాం..నేను కావాలని ఎందుకు చేస్తాను? మేము ఎవరి మనోభావాలను బాధపెట్టామో వారికి నేను హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాను. అన్నపూర్ణి వెనుక ఉద్దేశ్యం ప్రేరణ కలిగించడం, బాధను సృష్టించడం కాదు. గత రెండు దశాబ్దాలుగా చిత్ర పరిశ్రమలో నా ప్రయాణం ఒకే ఉద్దేశ్యంతో నడిపించింది – ఒకరిలో ఒకరు సానుకూలతను వ్యాప్తి చేయడం.. మంచిని ప్రోత్సహించడం. జై శ్రీరామ్ అని రాసుకొచ్చింది.. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..

Show comments