Site icon NTV Telugu

ట్రెండింగ్‌లో ధోని న్యూలుక్‌: అభిమానులు ఫిదా…

ఇండియాకు అన్ని ఫార్మాట్స్‌లో విజ‌యాలు అందించిన కెప్టెన్ ఎవ‌రు అంటే ట‌క్కున చెప్పే స‌మాధానం మ‌హెంద్ర‌సింగ్ ధోని.  పించ్ హిట్ట‌ర్‌గా, బెస్ట్ ఫినిష‌ర్‌గా ధోనికి మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న‌ది.  ఒక‌వైపు క్రికెట్‌లో రాణిస్తూనే మ‌రోవైపు ఫ్యాష‌న్ రంగంలో ధోని మెరుపులు మెరిపిస్తూ ఉంటాడు. తాజాగా ధోని స‌రికొత్త హెయిర్‌స్టైల్‌తో ఆక‌ట్టుకుంటున్నాడు.  ధోనీ హెయిర్‌స్టైల్, లుక్ అద్భుతంగా ఉన్నాయని ఆయ‌న అభిమానులు సోష‌ల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.  టెస్ట్‌, వండే మ్యాచ్‌ల నుంచి త‌ప్పుకున్న ధోని పొట్టి క్రికెట్ ఐపీఎల్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే.  ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిస సీజ‌న్స్‌లో అత్య‌ధిక‌సార్లు ఫైన‌ల్స్‌కు చేరుకున్న జ‌ట్టుగా సీఎస్‌కేకు పేరు ఉన్న‌ది.  

Read: నాగశౌర్యను కిస్ చేసిన హీరోయిన్… “లక్ష్య” పోస్టర్

Exit mobile version