ప్రధాని మోడీ పార్లమెంటు సాక్షిగా తెలంగాణ ప్రజల్ని అవమానించారని టీఆర్ఎస్ నేతలు ఆగ్రహంతో వున్నారు. సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, తలసాని, ఎర్రబెల్లి, ఎంపీలు బీజేపీ నేతల్ని టార్గెట్ చేశారు. తాజాగా మంత్రి కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా బీజేపీ తీరుని ఎండగట్టారు.
ఇది చాలా అవమానకరం. తెలంగాణ ప్రజల దశాబ్దాల స్ఫూర్తిదాయక పోరాటాన్ని మరియు త్యాగాలను ప్రధాని మోడీ పదే పదే అవమానిస్తున్నారు. ప్రధాని మోడీచేసిన అసంబద్ధ వ్యాఖ్యలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను మరియు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాను అని ట్వీట్ చేశారు కేటీఆర్. టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ విశ్వ గురు కాదు విష గురు అంటూ ట్వీట్ చేశారు.
