Site icon NTV Telugu

Ukraine to Hyderabad: పెంపుడు పిల్లితో ఉక్రెయిన్ నుంచి హైదరాబాద్ కి

అసలే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవించాల్సిన పరిస్థితులు. అలాగని అన్నీ వదులుకుని రావడం సుతరామూ ఇష్టం వుండదు కొందరికి. వరద ప్రాంతాలైనా.. వార్ ప్రాంతాల్లోని వారికైనా ఇది సహజం. యుద్ధ క్షేత్రం ఉక్రెయిన్ నుండి తన పెంపుడు పిల్లితో సహా హైదరాబాద్ చేరుకున్నాడో యువకుడు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చిన్న కోరుకొండి గ్రామానికి చెందిన పుదూరు ప్రఖ్యాత్ ఉక్రెయిన్ లో వుంటున్నాడు. తన పిల్లికి వీసా, టికెట్ తీసుకుని విమానంలో సొంత గడ్డకు చేరుకోవటంతో అది చూసిన కుటుంబ సభ్యులు మిత్రులు అతడి జంతు ప్రేమను చూసి ఆశ్చర్యపోతున్నారు.

https://ntvtelugu.com/russian-troops-loot-local-stores-konotop/

ఖమ్మం కల్లూరు మండలం చిన్న కోరుకొండి గ్రామానికి చెందిన పుదూరు ప్రఖ్యాత్ ఉక్రెయిన్ లోని ఇవానో ఫ్రాన్ క్విస్క్(ivano-frankiv) లో మెడిసిన్ చదువుతున్నాడు. అయితే గత కొద్ది రోజులుగా అక్కడ జరుగుతున్న యుద్ధం నేపథ్యం ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని మూడు రోజుల పాటు సాంజ అనే తన పెంపుడు పిల్లిని నెత్తి మీద పెట్టుకొని ప్రయాణించి ఉక్రెయిన్ సరిహద్దులకు చేరుకొని అక్కడి నుంచి భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన విమానాల ద్వారా హైదరాబాద్ కు చేరుకున్నానని ప్రఖ్యాత్ తెలిపాడు. మరో రెండు నెలల్లో అతని చదువు పూర్తి కావాల్సి ఉంది. కానీ ఈ లోపే అక్కడ యుద్ధం ప్రారంభం కావటం తో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని రెండు వందల మంది విద్యార్థులతో పాటు పిల్లి నీ కూడా విమానంలో వెంట తీసుకు వచ్చాడు.

పిల్లి, కుటుంబ సభ్యులతో ప్రఖ్యాత్

ఒకవైపు యుద్ధం జరుగుతున్నా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని మూడు రోజుల పాటు తాను ఉంటున్న ఇవానో ఫ్రాన్ క్విస్క్ నుండి సరిహద్దులకు చేరుకోవటానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు చలిలో తిండి లేకుండా పిల్లిని నెత్తిమీద పెట్టుకుని తీసుకు వచ్చానని ప్రఖ్యాత్ తెలిపాడు. ప్రస్తుతం ఇక్కడ వేడి ఉష్ణోగ్రతలు,కొత్త ప్రాంతం కావడం వల్ల పిల్లి భయపడుతుంది అని కొద్ది రోజుల్లో సెట్ అవుతుందంటున్నాడు పుదూరు ప్రఖ్యాత్. వైద్య విద్య బోధించే అధ్యాపకురాలు తనకు పిల్లిని బహుమతిగా ఇచ్చారని సాంజ అనే పేరు పెట్టుకుని అల్లారుముద్దుగా పెంచుకున్న దానిని అక్కడే వదిలి వేయలేక తనతోపాటు తీసుకువచ్చిన ప్రఖ్యాత్ జంతు ప్రేమను అతని కుటుంబ సభ్యులు స్నేహితులు అభినందిస్తున్నారు.

Exit mobile version