సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుండి టాలెంట్ ను అడ్డుకోవడానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా పోయాయి. ఆ ట్యాలెంట్ రోడ్డుపై ఉన్నా, బస్టాండ్ లో ఉన్నా, రైల్వే స్టేషన్ లో ఉన్నా లేదా మారుమూల గ్రామంలో ఉన్నా కూడా బయటకు రావాల్సిందే. ఇక ఏదైనా వీడియో వైరల్ అయ్యిందంటే దాన్ని మీ ముందుకు రాకుండా ఎవరూ ఆపలేరు. అదీ సోషల్ మీడియా పవర్.
Read Also : విజయవాడ దుర్గమ్మను దర్శించిన సోనూసూద్
అయితే గత కొన్నాళ్ల నుంచి ‘మణికే మాగే హితే’ అనే సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ అమ్మాయి వాయిస్ ను ఇంటర్నెట్ ఫిదా అయిపొయింది. అయితే తాజాగా బాలీవుడ్ ను ఈ సాంగ్ ఊపేస్తోంది. అమితాబ్ నుంచి టైగర్, పరిణితి చోప్రా, మాధురి దీక్షిత్ వంటి వారు సైతం ఆ సాంగ్ కు ఫ్యాన్స్ అయిపోయారు. ప్రస్తుతం ‘మణికే మాగే హితే’ సాంగ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు, ఇన్‌స్టాగ్రామ్‌లో తెగ చక్కర్లు కొడుతోంది. దీంతో ఈ పాట ఎక్కడ నుండి వచ్చింది ? ఎవరు పాడారు ? అనే విషయం తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలోనూ మొదలైంది.
ఈ పాటను ప్రముఖ శ్రీలంక సింగర్, రాపర్ యోహానీ పాడారు. ఇండియాలో కూడా యోహాని డి సిల్వా రాసిన ‘మణికే మాగే హితే’ కవర్ వెర్షన్ బాగా ఆకట్టుకుంటోంది. ఇటీవల అమితాబ్ బచ్చన్ ఈ సాంగ్ కు సంబంధించి ఒక ప్రత్యేక పోస్ట్ పంచుకోవడంతో ఆ సాంగ్ క్రేజ్ మరింతగా పెరిగింది.
A post shared by Amitabh Bachchan (@amitabhbachchan)
A post shared by Madhuri Dixit (@madhuridixitnene)
A post shared by Tiger Shroff (@tigerjackieshroff)
A post shared by Parineeti Chopra (@parineetichopra)