Site icon NTV Telugu

వైర‌ల్‌: సెకండ్ హ్యాండ్ ప్రిడ్జ్ లో నోట్ల కట్టలు…

త‌క్కువ ధ‌ర‌కు వ‌స్తుంది క‌దా అని చెప్పి ఓ వ్య‌క్తి సెకండ్ హ్యాండ్‌లో ప్రిడ్జ్‌ను కోనుగోలు చేశాడు.  ఇంటికి తెచ్చుకున్నాక ఆ ప్రిడ్డ్ ను శుభ్రం చేసే స‌మ‌యంలో కింద స్టిక్క‌ర్ క‌నిపించింది.  ఆ స్టిక్క‌ర్‌ను ఓపెన్ చేయ‌గా లోప‌లి నుంచి నోట్ల క‌ట్ట‌లు బ‌య‌ట‌ప‌డ్డాయి.  ఒక‌టి కాదు రెండు కాదు… 1.30 లక్ష‌ల డాల‌ర్లు.  మ‌న క‌రెన్సీలో సుమారుగా రూ.96 ల‌క్ష‌లు అని చెప్పొచ్చు.  అంత పెద్ద మొత్తంలో డ‌బ్బును చూసి మొద‌ట కోనుగోలు దారుడు సంబ‌ర‌ప‌డ్డాడు.  ఏమైందో ఏమోగాని మ‌న‌సు మార్చుకొని ఆ డబ్బును పోలీస్ స్టేష‌న్‌లో అప్ప‌గించాడు.  అత‌ని మంచి మ‌న‌సుకు పోలీసులు మెచ్చుకున్నారు.  సెకండ్ హ్యాండ్ ప్రిడ్జ్‌ను అమ్మిన వ్య‌క్తి కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు.  ఆ వ్య‌క్తి ఎవ‌రో తెలిస్తే ఆ డబ్బును అత‌నికి అప్ప‌గిస్తారు.  లేదంటే ప్రిడ్జ్‌ను కొనుగోలు చేసిన వ్య‌క్తికి ఆ డ‌బ్బును అందిస్తారు.  ద‌క్షిణ కొరియా చ‌ట్టాల ప్ర‌కారం 22 శాతం ప‌న్ను ప్ర‌భుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది.  ఈ సంఘ‌ట‌న ద‌క్షిణ కొరియాలోని బెజు ద్వీపంలో జ‌రిగింది.  

Read: సింగిల్ డోస్ వ్యాక్సిన్‌- భార‌త్‌లో సెప్టెంబ‌ర్ నుంచి అందుబాటులోకి…!!

Exit mobile version