NTV Telugu Site icon

తెలంగాణలో మరో 10 రోజులు లాక్ డౌన్ పొడిగింపు.. టైమింగ్స్ ఇవే

cm kcr

cm kcr

లాక్‌డౌన్‌ను మరోసారి పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణ కేబినెట్‌… ఇవాళ ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన సమావేశమైన కేబినెట్.. రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా పరిస్థితులు, లాక్‌డౌన్‌, సడలింపులు తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించింది. ప్రస్తుత లాక్‌డౌన్‌ ఈ నెల 9వ తేదీతో ముగియనుండగా.. మరో 10 రోజుల పాటు పొడిగించారు.. ఇదే సమయంలో.. సడలింపులు సమయాన్ని పెంచుతూ.. లాక్‌డౌన్‌ సమయాన్ని కుదిస్తూ నిర్ణయం తీసుకున్నారు.. కేబినెట్‌ తాజా నిర్ణయం ప్రకారం.. ఈ నెల 10వ తేదీ నుంచి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సడలింపులు ఉంటాయి.. ఇక, ఇంటికి చేరుకోవడానికి అదనంగా మరో గంట అంటే సాయంత్రం 6 గంటల వరకు సడలింపులు అమల్లో ఉండనుండా.. సాయంత్రం 6 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కఠినంగా లాక్‌డౌన్‌ అమలు చేయాలని కేబినెట్‌ నిర్ణయించింది. మరోవైపు.. కరోనా కేసులు ఎక్కువగా ఉన్న ఖమ్మం జిల్లా మధిర, సత్తుపల్లి.. నకిరేకల్‌ మినహా మిగతా నల్గొండ జిల్లాలో ప్రస్తుత లాక్‌డౌన్‌ స్థితి కొనసాగుతుందని ప్రకటించింది సర్కార్.