సింహాల వేట ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. టార్గెట్ చేసింది అంటే వేట చిక్కాల్సిందే. ఓ జింకను వేటాడిన సింహం దానిని పట్టుకొని చెట్టు ఎక్కి కూర్చుంది. అయితే, ఈ జింక కోసం మరో ఐదు సింహాలు కూడా చెట్టు ఎక్కాయి. ఒకటి జింక మెడ భాగం గట్టిగా పట్టుకుంటే, మరోకటి దాని కాళ్లు పట్టుకుంది. అంతలో మరో సింహం చెట్టు ఎక్కి దాని పొట్టభాగం పట్టుకుంది. అయితే, అన్ని సింహాలు జింక కోసం పోటీ పడటంతో పట్టుతప్పి కిందపడ్డాయి. అలా కింద పడిన వెంటనే అన్ని సింహాలు ఒక్కసారిగా జింకపై దాడిచేసి దొరికన భాగాన్ని దొరికినట్టుగా నోట కరుచుకుపోయాయి. 45 సెకన్ల నిడివి కలిగిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వైరల్: ఒక జింక కోసం ఆరు సింహాల ఫైట్… చివరకు…
