Site icon NTV Telugu

‘తిక్క’ సుందరి తిరిగొస్తానంటే… తేజు ఫ్యాన్స్ తెగ అల్లరి!

Larissa post about To Visit Hyderabad, Fans Tease Tej

లారిస్సా బొనేసి గుర్తుందా? సాయి ధరమ్ తేజ్ ‘తిక్క’ మూవీ హీరోయిన్! బ్రెజిలియన్ బ్యూటీ ఇటు టాలీవుడ్ లో, అటు బాలీవుడ్ లో ఎక్కడా గట్టిగా నిలుదొక్కుకోలేకపోయింది. బీ-టౌన్ లో ఆమెని సల్మాన్ క్యాంప్ లో హీరోయిన్ గా కన్ సిడర్ చేస్తారు. అయినా కూడా హిట్ సినిమాలు లేక లారిస్సా ప్రస్తుతం ఖాళీగానే ఉంటోంది. అయితే, బ్రెజిల్ బేబీ తాజా ట్వీట్ చూస్తే మాత్రం తెలుగులో ఏదో మంచి ఆఫరే వచ్చినట్టు అనిపిస్తోంది…

Read Also : థియేటర్లు అప్పటి వరకూ ఓపెన్ కావట!

లారిస్సా ‘త్వరలో హైద్రాబాద్ వద్దామనుకుంటున్నాను! చాలా రోజుల తరువాత…’ అంటూ ట్వీట్ చేసింది! ఇది చూసిన ఆమె ‘తిక్క’ సినిమా కోస్టార్ సాయి తేజ్ రెస్పాండ్ అయ్యాడు. ‘అల్లాదీన్’ ‘ఆ…’ అంటూ ఆశ్చర్యపోయే జిఫ్ ఒకటి షేర్ చేశాడు! ఇంకేముంది… ట్విట్టర్ లో నెటిజన్స్ చెలరేగిపోయారు. ముఖ్యంగా, సాయి తేజ్ ఫ్యాన్స్ ‘సుప్రీమ్’ స్టార్ ని తమ కొంటె కామెంట్లతో ఆటపట్టించేశారు. ఒకరు ‘అన్నా! పార్టీ గట్టిగా ఉండాలి…’ అన్నారు. ఇంకొకరు తేజుని, లారిస్సాని ట్యాగ్ చేసి మరీ ‘వదిన అరైవింగ్ సూన్’ అనేశారు! దానర్థం మిస్ బొనేసీకి తెలియకపోవచ్చుగానీ సాయితేజ్ చూసి ఉంటే మాత్రం ముసిముసిగా నవ్వుకునే ఉంటాడు!

‘తిక్క’ సినిమా సమయంలో కొన్ని చోట్ల తేజు, లారిస్సా డేటింగ్ అంటూ అప్పట్లో పుకార్లు వినిపించాయి. కానీ, ఆ తరువాత బ్రెజిల్ బ్యూటీ హైద్రాబాద్ కు బైబై చెప్పేయటంతో గాసిప్స్ చల్లబడిపోయాయి. ఇప్పుడు ‘తిక్క’ సినిమా తిలోత్తమ తిరిగి వస్తానంటోంది… చూడాలి మరి!

Exit mobile version