థియేటర్లు అప్పటి వరకూ ఓపెన్ కావట!

కరోనా మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా సినిమా థియేటర్లు మూతబడ్డ విషయం తెలిసిందే. ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రభావం తగ్గడంతో నెమ్మదిగా రాష్ట్ర ప్రభుత్వాలు థియేటర్లు తెరుచుకోవడానికి అనుమతులు ఇస్తున్నాయి. అయితే జూలై 9 నుండి సినిమా హాళ్ళు, మల్టీప్లెక్సులు తిరిగి తెరవబడతాయని యూపీ సినిమా ఎగ్జిబిటర్స్ ఫెడరేషన్ ఇంతకుముందు ప్రకటించింది. కానీ ఇప్పుడు ఈ నిర్ణయం మార్చుకున్నారు.

Read Also : పంచ్ డైలాగ్స్ తో అదరగొట్టిన ‘స్టాండప్ రాహుల్’

ఫెడరేషన్ అధ్యక్షుడు ఆశిష్ అగర్వాల్ మాట్లాడుతూ “సినిమా హాళ్ళు – సింగిల్ స్క్రీన్, మల్టీప్లెక్సులు శుక్రవారం నుండి తిరిగి తెరవడంలో అర్థం లేదు. ఎందుకంటే శనివారం, ఆదివారం వీకెండ్ కర్ఫ్యూ కొనసాగుతుంది. చాలా కుటుంబాలు వారాంతాల్లోనే సినిమాలు చూస్తారు. ఎందుకంటే వీకెండ్ అనేది అందరికీ సెలవుదినం. అంతేకాకుండా రాత్రి 9 గంటల నుండి ప్రారంభమయ్యే నైట్ కర్ఫ్యూ అంటే నైట్ షోలను కూడా నడిపే అవకాశం ఉండదు. అటువంటి పరిస్థితిలో ఖాళీ ప్రదర్శనల కోసం హాళ్ళను తిరిగి తెరవడంలో అర్థం లేదు” అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాకుండా కోవిడ్ కేసులు ఇప్పుడు చాలా తక్కువగా ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం వారాంతపు కర్ఫ్యూ, రాత్రి కర్ఫ్యూను విరమించుకోవాలని థియేటర్ల యజమానులు కోరుతున్నారని పేర్కొన్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-