NTV Telugu Site icon

Klin Kaara: చరణ్‌-ఉపాసనల కూతురిపై స్పెషల్ సాంగ్..ఎంత బాగుందో కదా..

Klinkaara

Klinkaara

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులకు పెళ్ళైన పదేళ్లకు కూతురు పుట్టిన సంగతి తెలిసిందే.. గతేడాది జూన్‌లో జన్మించిన ఈ పాపాయికి క్లీంకార అని నామకరణం చేశారు. ఇదేదో అల్లాటప్పాగా పెట్టిన పేరు కాదు.. ఎంతో పవిత్రమైన అర్థం వచ్చేలా లలితా సహస్రనామాల నుంచి తీసుకున్న పదం. ‘క్లీంకార’ అనే పదం ప్రకృతి స్వరూపాన్ని, మాతాశక్తిలో నిక్షిప్తమైన అనుగ్రహాన్ని సూచిస్తుందని, ఆ పేరులోనే శక్తివంతమైన వైబ్రేషన్ ఉందని మెగాస్టార్ చిరంజీవి ఈ పేరు అర్థాన్ని వివరించారు..

క్లింకార పుట్టిన తర్వాత మెగా ఫ్యామిలీకి బాగా కలిసి వస్తుందని, ప్రతి పండుగను ఘనంగా చేసుకుంటున్నారు.. ఈ క్రమంలోనే సంక్రాంతిని ఎంతో గ్రాండ్‌గా జరుపుకున్నారు. ఈసారి హైదరాబాద్‌లో కాకుండా బెంగళూరులో వేడుకలు జరుపుకున్నారు. మెగా, అల్లు ఫ్యామిలీ మొత్తం ఈ వేడుకల్లో పాల్గొనడం విశేషం. ఇదిలా ఉంటే క్లీంకార గురించి ఓ పాట రెడీ చేశారు మెగా ఫ్యాన్స్‌. ఆ పాటను సంక్రాంతి కానుకగా ఉపాసన విడుదల చేశారు..

ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.. ఈ పాటను మహవీర్ ఎల్లందర్ కంపోజ్ చేసిన ట్యూన్‌కు తగ్గట్లుగా బెల్లంకొండ శ్రీధర్ లిరిక్స్ రాశాడు. సింగర్ ధనుంజయ్ దీన్ని అద్భుతంగా ఆలపించారు.. ఈ పాటను విడుదల చేసిన కొద్ది నిమిషాల్లో ట్రెండ్ అవుతుంది.. ఇక చరణ్ సినిమాల విషయానికొస్తే.. గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్నాడు.. ఈ సినిమా ఈ ఏడాదిలో విడుదల కాబోతుంది.. ఇక ఆ తర్వాత బుచ్చిబాబుతో మరో సినిమాను చేయబోతున్నాడు..