Site icon NTV Telugu

Indigo Airlines: ‘క్యూట్’ చార్జ్ వెనుక అసలు బాగోతం ఇది!

Indigo Cute Charges

Indigo Cute Charges

ఎయిర్‌లైన్ సంస్థలు విమాన టికెట్‌లో సెక్యూరిటీ ఫీ, యూజర్‌ డెవలప్‌మెంట్‌ ఫీ అంటూ పలు చార్జీలను వసూలు చేసే విషయం అందరికీ తెలిసిందే! అయితే.. రీసెంట్‌గా ఇండిగో టికెట్‌లో ‘క్యూట్ చార్జ్’ కనిపించడం సర్వత్రా చర్చలకు దారి తీసింది. శాంతను అనే వ్యక్తి ‘క్యూట్ చార్జ్’ని హైలైట్ చేస్తూ.. ‘‘వయసుతో పాటు నేను అందంగా తయారవుతున్న విషయం నాకు తెలుసు కానీ, అందుకు ఇండిగో ఇలా రూ. 100 చార్జ్ చేస్తుందని ఎప్పుడూ ఊహించలేదు’’ అని ట్వీట్ చేశాడు. ఇది చూసి నెటిజన్లు ఇండిగో సంస్థపై సెటైర్లు వేయడం మొదలుపెట్టారు. ఏవేవో చార్జీల పేరు చెప్తూ ప్రజలపై భారం మోపుతున్నారని మండిపడ్డారు.

సిమ్రన్ వాలియా అనే మరో నెటిజన్ మరో అడుగు ముందుకేస్తూ.. తనదైన శైలిలో ఇండియా సంస్థపై సెటైర్ వేయాలని ప్రయత్నించింది. ‘ఇండిగోలో ఇలాంటి కొత్త చార్జెస్ ఉండటం వల్లే నేను ఆ ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయడం లేదు. నా అందానికైతే రూ. 20 వేల రుసులు వసూలు చేసేవారేమో. అదే జరిగితే.. ఫ్లైట్ టికెట్ కంటే నా అందానికే ఎక్కువ ధర అవుతుంది’’ అవుతుందంటూ ట్వీట్ చేసింది. ఇంకేముంది.. మండిపడ్డ ఇండిగో సంస్థ అసలు విషయాన్ని బహిర్గతం చేసింది. మీరంతా అనుకుంటున్నట్టు ‘క్యూట్’ అంటే అందం కాదు, ‘కామన్‌ యూజర్‌ టెర్మినల్‌ ఎక్విప్‌మెంట్’ అంటూ బదులిచ్చింది. ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా ఈ ఛార్జీలు వసూలు చేస్తుందని క్లారిటీ ఇచ్చింది.

‘‘విమానాశ్రయాల్లోని మెటల్‌ డిటెక్టింగ్‌ మిషన్లు, ఎస్కలేటర్లు, ఇతర సామగ్రిని ఉపయోగిస్తున్నందుకు.. క్యూట్ పేరిట రూ. 100 వసూలు చేస్తారు. ఈ విషయం తెలుసుకొని మాట్లాడండి. మీకు సేవలు అందించేందుకు మేమున్నాం’’ అంటూ ఇండిగో ఘుటుగా ట్వీట్ చేసింది. దీంతో.. అసలు విషయం తెలుసుకొని, నెటిజన్లంతా సైలెంట్ అయిపోయారు.

Exit mobile version