Site icon NTV Telugu

IND vs NZ Final 2026: టీమిండియాకు కలిసిరాని ‘సండే’ ఫైనల్స్‌.. ఈసారి సెంటిమెంట్ బ్రేక్ చేస్తుందా?

Team India Sunday Finals

Team India Sunday Finals

Team India’s Poor Record in Sunday World Cup Finals: ప్రపంచ కప్ ఫైనల్స్‌లో టీమిండియా ప్రదర్శనను పరిశీలిస్తే.. ఒక ఆసక్తికరమైన సెంటిమెంట్ కనిపిస్తోంది. ముఖ్యంగా ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌ల్లో భారత జట్టు ఇప్పటివరకు ట్రోఫీని గెలుచుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో 2026 టీ20 ప్రపంచ కప్ ఫైనల్ కూడా ఆదివారం జరగనుండటంతో.. క్రికెట్ అభిమానుల్లో పెద్ద చర్చ మొదలైంది. ఈసారి అయినా ఆ సెంటిమెంట్‌ను చెరిపేసి భారత్ విజయం సాధిస్తుందా? అనే ఉత్కంఠ నెలకొంది.

గతంలో జరిగిన వరల్డ్ కప్ ఫైనల్స్‌ను పరిశీలిస్తే ఆసక్తికరమైన ఫలితాలు ఉన్నాయి. 1993లో శనివారం జరిగిన వరల్డ్ కప్ ఫైనల్‌లో భారత్ విజయం సాధించింది. అయితే 2003లో ఆదివారం జరిగిన వరల్డ్ కప్ ఫైనల్‌లో టీమిండియా ఓటమి చవిచూసింది. 2007లో సోమవారం జరిగిన తొలి టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో భారత్ చరిత్ర సృష్టిస్తూ ట్రోఫీని గెలుచుకుంది. అలాగే 2011లో శనివారం జరిగిన వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌లో కూడా టీమిండియా విజేతగా నిలిచింది.

2014లో ఆదివారం జరిగిన టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో భారత్ ఓడిపోయింది. అదే విధంగా 2023లో ఆదివారం జరిగిన వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌లో కూడా టీమిండియా పరాజయం పాలైంది. ఇక 2024లో శనివారం జరిగిన టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో భారత్ ట్రోఫీని గెలుచుకుంది. ఇప్పుడు 2026 టీ20 వరల్డ్ కప్ ఫైనల్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఆదివారం జరగనుంది. ఇప్పటివరకు ఆదివారం జరిగిన వరల్డ్ కప్ ఫైనల్స్‌లో భారత్ గెలవకపోవడం ఒక సెంటిమెంట్‌గా మారింది. దీంతో ఈసారి ఆ రికార్డును చెరిపేసి భారత్ చరిత్ర సృష్టిస్తుందా? అన్నది ఆసక్తికరంగా మారింది. కోట్లాది మంది అభిమానులు భారత జట్టు విజయాన్ని ఆశిస్తూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

Exit mobile version