NTV Telugu Site icon

Hi Nanna: ఓటిటి లోకి రానున్న ‘Hi Nanna’.. ఎప్పుడు, ఎక్కడంటే?

hi nanna

hi nanna

దసరా సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న న్యాచురల్ స్టార్ నాని ఇప్పుడు మరో కొత్త సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు.. ఆ సినిమా పేరు ‘హాయ్ నాన్న’.. ఈ సినిమా తాజాగా విడుదల అయ్యింది.. కొత్త డైరక్టర్స్ ని పరిచయం చేయడంలో ముందుండే నాని… మరోసారి అదే పంథాలో అడుగులు వేస్తూ శౌర్యువ్ అనే దర్శకుడిని ఈ సినిమాతో పరిచయం చేశారు. రిలీజ్ కి ముందే నాని – మృణాల్ జోడీ, ప్రోమోలు ఆకట్టుకున్నాయి.. మొదటి షోకే పాజిటివ్ టాక్ ను అందుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటిలోకి కూడా రాబోతుంది.. ఎప్పుడు, ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో ఇప్పుడు చూద్దాం..

ఈ సినిమా ఓటిటి రైట్స్ ని Netflix సొంతం చేసుకుంది. అలాగే ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం “హాయ్ నాన్న” మూవీ రిపబ్లిక్ డే స్పెషల్ గా వచ్చే ఏడాది జనవరి చివరి వారంలో ఓటిటిలో లో స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే తెలుగు తో పాటు సౌత్ లోని అన్ని భాషలకు గాను కలిపి 37 కోట్లకు ఈ మూవీ డిజిటల్ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. నాని సినిమాకు ఈ రేంజ్ లో ఓటిటి రైట్స్ రావడం నిజంగా షాకింగ్ న్యూసే.. గతంలో వచ్చిన వాటికంటే ఇది ఎక్కువే..

ఇక ఈ మూవీ యొక్క శాటిలైట్ రైట్స్ ని ప్రముఖ టెలివిజన్ సంస్థ జెమినీ టీవీ వారు దక్కించుకుంది. తండ్రి కూతురు మధ్య సెంటిమెంట్ తో వచ్చిన ఈ మూవీ ఫీల్ గుడ్ ఎమోషనల్ గా అందరి చేత కంట తడి పెట్టిస్తుంది. తండ్రీ కూతుళ్ల పాత్రలు ఆ ఇద్దరి నేపథ్యంలో పండే భావోద్వేగాలు ఈ సినిమాకి హైలైట్‌… ఈ సినిమా మొత్తం తండ్రీ కూతుర్ల బంధాన్ని చూపిస్తుంది.. క్లైమాక్స్ స్థాయి,ఎమోషన్స్ ని పండిస్తాయి.మేకర్స్. నాని కూడా ఈ సినిమాని తన భుజాల మీద వేసుకుని గట్టిగానే ప్రమోషన్స్ ఇచ్చారు.. మరి కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి..

Show comments