NTV Telugu Site icon

Pakistan: అమ్మమ్మ జ్ఞాపకార్థం 20 వేల మందికి భారీ విందు ఇచ్చిన బిచ్చగాడు (వీడియో)

Pakistan

Pakistan

పాకిస్థాన్‌లోని గుజ్రాన్‌వాలాలో ఒక బిచ్చగాడు తన అమ్మమ్మ జ్ఞాపకార్థం గొప్ప విందు ఏర్పాటు చేసి ప్రజలను ఆశ్చర్యపరిచిన షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ అపూర్వ ఘటనకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ బిచ్చగాడి అమ్మమ్మ ఇటీవల మరణించింది. ఆమె మరణించిన 40వ రోజున, ఈ వ్యక్తి తన అమ్మమ్మ జ్ఞాపకార్థం పెద్ద విందు ఏర్పాటు చేశాడు. విందులో సిరి పాయ, మురబ్బా, మటన్, నాన్-బఠానీ గంజ్ వంటి సాంప్రదాయ వంటకాలతో పాటు వివిధ రకాల మాంసాహార, తీపి వంటకాలు అందించాడు.

20 వేల మంది అతిథులకు ఆహ్వానం
బిచ్చగాడు విందును నిర్వహించడమే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి దాదాపు 20,000 మందిని ఆహ్వానించాడు. అతిథులను వేదిక వద్దకు చేర్చేందుకు 2 వేలకు పైగా వాహనాలను ఏర్పాటు చేశాడు. గుజ్రాన్‌వాలా రైల్వే స్టేషన్‌కు సమీపంలోని ఖాళీ మైదానంలో ఈ కార్యక్రమం జరిగింది. అక్కడ ప్రజలు గొప్ప విందును ఆనందించారు.

సోషల్ మీడియాలో వైరల్‌..
ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై జనాలు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఒక బిచ్చగాడికి అంత డబ్బు ఎలా వచ్చింది అని కొందరు ప్రశ్నిస్తున్నారు. అమ్మమ్మ స్మారకార్థం ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించడంపై కొందరు ప్రశంసించారు.

అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది?
అయితే ఈ బిచ్చగాడు ఇంత భారీ మొత్తాన్ని ఎలా వసూలు చేశాడనే విషయంపై క్లారిటీ లేదు. కానీ ఆమె అమ్మమ్మ పట్ల ఉన్న ప్రేమ, భక్తి సోషల్ మీడియాలో ప్రజల హృదయాలను గెలుచుకుంటున్నాడు. ఈ ఘటన దిగ్భ్రాంతిని కలిగించడమే కాకుండా బిచ్చగాడు ఇంత డబ్బు ఎలా ఖర్చు పెడుతున్నాడనే ప్రశ్న కూడా చాలా మందిలో తలెత్తుతోంది. అయితే ఈ మొత్తం విందు ధర రూ.1.25 కోట్లు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

Show comments