NTV Telugu Site icon

Guntur Kaaram : ‘గుంటూరు కారం’ సక్సెస్ సెలబ్రేషన్స్.. గురూజీ మిస్ అయ్యాడే?

Success Party

Success Party

సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన గుంటూరు కారం సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యింది.. కేవలం నాలుగు రోజుల్లోనే 175 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది గుంటూరు కారం.. ఇక మరి కొన్ని రోజులు సంక్రాంతి హాలిడేస్ ఉండటంతో ఫ్యామిలీలు థియేటర్స్ కి వెళ్తున్నారు. గుంటూరు కారం సినిమా సక్సెస్ అయి భారీ కలెక్షన్స్ వైపు దూసుకెళ్తుంది.. ఈ వారం కలెక్షన్స్ భారీగా పెరగనున్నాయి..

ఈ సినిమా సక్సెస్ ను అందుకున్న సందర్భంగాగుంటూరు కారం టీమ్ సక్సెస్ పార్టీని ఏర్పాటు చేశారు..అయితే కేవలం కొంతమంది మాత్రమే ప్రైవేట్ పార్టీలా చేసుకున్నారు. నిన్న సంక్రాంతి కూడా కావడంతో చిత్రయూనిట్ మహేష్ ఇంట్లో ఈ సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకున్నట్టు తెలుస్తుంది. ఈ సెలబ్రేషన్స్ లో మహేష్ బాబు ఫ్యామిలీ, దిల్ రాజు ఫ్యామిలీ, నాగవంశీ ఫ్యామిలీ, శ్రీలీల, మీనాక్షి చౌదరి పాల్గొన్నారు. మహేష్, శ్రీలీల, నమ్రత ఈ సక్సెస్ పార్టీ కి సంబందించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు..

ఈ ఫోటోలలో ఎక్కడా త్రివిక్రమ్ కనిపించలేదు.. దాంతో నెటిజన్లు గురూజీ ఎక్కడ అని కామెంట్స్ చేస్తున్నారు..డైరెక్టర్ లేకుండా పార్టీ చేసేసుకుంటున్నారా అని కామెంట్స్ చేస్తున్నారు. ఇక మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కూడా ఈ పార్టీకి రాకపోవడం గమనార్హం.. మొత్తానికి ఈ పార్టీ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి.. ఓ లుక్ వేసుకోండి..