NTV Telugu Site icon

నాసా హెచ్చ‌రిక‌: భూమివైపు దూసుకొస్తున్న మ‌రో ముప్పు…

భూమివైపు అతిపెద్ద గ్ర‌హ‌శ‌క‌లం దూసుకొస్తున్న‌ట్టు నాసా హెచ్చ‌రించింది.  1994 పీసీ 1 గా దీనికి నామ‌క‌ర‌ణం చేశారు.  మొద‌టిసారిగా దీనిని రాబ‌ర్ట్ మెక్‌నాట్ అనే ఖ‌గోళ శాస్త్ర‌వేత్త 1994 ఆగ‌స్ట్ 9న క‌నుగొన్నారు. ఈ గ్ర‌హ‌శ‌క‌లం గంల‌కు 43,754 మైళ్ల వేగంతో ప్ర‌యాణం చేస్తున్న‌ది.  అయితే, ఇది భూమి నుంచి సుమారు 1.2 మిలియ‌న్ మైళ్ల దూరం నుంచి వెళ్తుంద‌ని, దీని వ‌ల‌న భూక‌క్ష్య‌లో పెను మార్పులు వ‌చ్చే అవ‌కాశం ఉందని నాసా హెచ్చ‌రించింది.  జ‌న‌వ‌రి 18, 2022 న అంటే ఈరోజు భూమిని దాటుకొని వెళ్ల‌నుంది.  సుమారు 1 కిమీ వ్యాసం క‌లిగిన ఈ గ్ర‌హ‌శ‌క‌లం చుట్టూ కొన్ని గ్ర‌హ‌శ‌క‌లాలు కూడా ఉన్నాయ‌ని నాసా తెలియ‌జేసింది.  అతిపెద్ద‌దైన ఈ గ్ర‌హ‌శ‌క‌లం భూమిని దాటే ఈ గ్ర‌హ‌శ‌క‌లాన్ని టెలిస్కోప్ ద్వారా చూడ‌వ‌చ్చ‌ని నాసా తెలియ‌జేసింది.   జ‌న‌వ‌రి నెలలో 5 గ్ర‌హ‌శ‌క‌లాలు భూమిని దాటి వెళ్ల‌నున్నాయని, ఇలాంటి శ‌క‌లాల వ‌ల‌న ఎప్ప‌టికైనా ప్ర‌మాద‌మై అని నాసా శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు.  

Read: విజ‌య‌వాడ జీజీహెచ్‌లో క‌రోనా క‌ల‌క‌లం… 50 మందికి పాజిటివ్‌…