మిడిల్ ఈస్ట్ దేశాల్లో కరోనా కేసులు భారీ స్థాయిలో నమోదవుతున్నాయి. కరోనా నుంచి కోలుకున్న దేశాల్లో కూడా డెల్టా వేరియంట్ వేగంగా వ్యాపిస్తున్నది. మిడిల్ ఈస్ట్‌లో ఉన్న 22 దేశాల్లో ఇప్పటికే 15 దేశాల్లో ఈ వేరియంట్ వ్యాపిస్తున్నది. ఈ దేశాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ నెమ్మదిగా సాగుతుండటంతో ఈ పరిస్థితులు వచ్చాయని ప్రపంచ ఆరోగ్యసంస్థ తెలియజేసింది. మొరాకో నుంచి పాకిస్తాన్ వరకు గల మధ్యప్రాశ్చ్యదేశాల్లో ఈ కేసులు రికార్డ్ స్థాయిలో నమోదవుతున్నాయి. వ్యాక్సిన్ తీసుకోని వారిలో తీవ్రత అధికంగా కనిపిస్తుందని, ఆసుపత్రులకు వెళ్లాల్సిన అవసరం ఏర్పడుతుందని వైద్యనిపుణులు చెబుతున్నారు.
Read: వీడియో : సితార పెయింటింగ్ పాఠాలు
ఈ మిడిల్ ఈస్ట్ దేశాల్లోని అనేక దేశాల్లో నాలుగో వేవ్ మొదలైనట్టు అధికారులు ఆంచనా వేస్తున్నారు. మిడిల్ ఈస్ట్ దేశాల్లో కేవలం నాలుగు కోట్ల మందికి మాత్రమే టీకాలు వేసినట్టు గణాంకాలు చెబుతున్నాయి. దీంతో ఆయా దేశాల్లో 55 శాతం మేర కేసులు పెరిగాయని, డెత్ రేటు కూడా 15 శాతం పెరిగినట్టు అధికారులు చెబుతున్నారు. ప్రపంచంలో వేగంగా వ్యాక్సినేషన్ అందిస్తున్న అమెరికా వంటి దేశాల్లో కూడా కేసులు మరోమారు గణనీయంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నది.
