Site icon NTV Telugu

Electricity Bill: వాడ‌కుండానే బిల్లు వాచిపోయింది… ఇక వాడితే…

సాధార‌ణంగా ఇంటికి విద్యుత్ బిల్లు వందో రెండో వంద‌లో వ‌స్తుంది. మ‌హా వాడితే 500 నుంచి వెయ్యి రూపాయ‌ల వ‌ర‌కు వ‌స్తుంది. అప్ప‌టి వ‌ర‌కు రూ. 175 విద్యుత్ బిల్లు వ‌స్తుండ‌గా, ఫిబ్ర‌వ‌రి నెలలో బిల్లు ఏకంగా మూడు కోట్ల రూపాల‌య‌కు పైగా వ‌చ్చింది. ఆ బిల్లును చూసి ఇంటి య‌జ‌మాని షాక్ అయ్యాడు. తాము ఏ నెలలో కూడా విద్యుత్ బిల్లులు బ‌కాయిలు పెట్ట‌లేద‌ని, ప్ర‌తినెలా చెల్లిస్తూనే ఉన్నామ‌ని, ప్ర‌తినెలా త‌మ‌కు రూ. 175 కు మించి రాద‌ని, రూ. 3.21 కోట్ల బిల్లు వేస్తే తాము ఎక్క‌డి నుంచి తెచ్చి క‌ట్టాల‌ని ఇంటి య‌జ‌మాని శ్రీరంగం వెంక‌టేశ్వ‌ర్లు విద్యుత్ అధికారుల‌ముందు వాపోయాడు.

Read: Chicken: భారీగా పెరిగిన నాటుకోడి ధ‌ర‌లు… పెరిగిన ఆర్డ‌ర్లు…

బిల్లును ప‌రిశీలించిన అధికారులు, బిల్లు తీసే మిష‌న్‌లో లోపం కార‌ణంగానే త‌ప్పు వ‌చ్చింద‌ని, లోపాన్ని స‌రిచేసి కొత్త బిల్లు రూ. 175 ఇచ్చిన‌ట్టు అధికారులు పేర్కొన్నారు. ఈ సంఘ‌ట‌న మ‌హ‌బూబాబాద్‌లో జ‌రిగింది. పెద్ద మొత్తంలో బిల్లు వ‌చ్చింది కాబ‌ట్టి అధికారుల వ‌ద్ద‌కు వెళ్లి స‌రిచేయించుకున్నారు. అదే రెగ్యుల‌ర్‌గా వ‌చ్చే బిల్లుకు రూ. 50 లేదా రూ. 100 ఎక్కువ వేసి ఉంటే తెలియ‌కుండానే క‌ట్టేసేవారు. బిల్లులు తీసే స‌మ‌యంలో జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని, ఇలాంటి త‌ప్పులు జ‌రుకుండా చూసుకోవాల‌ని అధికారులు ఆదేశించారు.

Exit mobile version