దీపావళి పండుగ వచ్చిందంటే చాలు ఎక్కడ చూసినా సందడే సందడి. పవిత్రకు ప్రతిరూపం గోమాత. ఆవుపేడతో చేసిన ప్రమిదలు దీపావళికి ట్రెండ్ అవుతున్నాయి. వీటి ప్రత్యేక ఏంటంటే కింద పడ్డా పగలవు. ఎకో ఫ్రెండ్లీ ఆలోచనతో తయారుచేసిన ప్రమిదలు ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి. శ్రీ శంకర విద్యాభారతీ గో సంరక్షణ చారిటబుల్ ట్రస్ట్ న్యూ నల్లకుంట ఆధ్వర్యంలో ఈ ప్రమిదలు తయారవుతున్నాయి.
ఈ ప్రమిదలకు మంచి ఆదరణ లభిస్తోందని నిర్వాహకులు తెలిపారు. సనాతన ధర్మం గోవు మీద ఆధారపడి వుందని శ్రీనివాస్ తెలిపారు. గోమాతను రక్షించుకోవడానికి తాము కట్టుబడి ఉన్నామన్నారు. కబేళాలకు తరలిపోయే గోమాతలను మేం కాపాడుతున్నామన్నారు. ఆత్మనిర్భర భారత్ లో భాగంగా గోమ ఉత్పత్తులను తయారుచేస్తున్నామన్నారు. ఆవు పేడతో విబూది, టూత్ పౌడర్ తయారుచేస్తున్నాం.
వినాయకచవితికి గణపతులు, జపమాలలు, దీపావళికి లక్ష్మీదేవి విగ్రహాలు, గోమూత్రంలో ఫినాయిల్, ఆర్గానిక్ ఉత్పత్తులు తయారుచేస్తున్నామని శ్రీనివాస్ తెలిపారు. గో మాత ద్వారా సమాజంలో ఆరోగ్యం లభిస్తుంది. ఈ ట్రస్ట్ ద్వారా 20 మందికి ఉపాధి కల్పిస్తున్నామన్నారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ ద్వారా విగ్రహాలు తయారుచేయడం తగ్గించాలన్నారు. విగ్రహాలను ఆవుపేడతో తయారుచేయాలన్నారు. గోమయంతో శివలింగం తయారుచేశారు. జపమాల కూడా ఆవుపేడతో తయారుచేశాం. నరదృష్టిని తగ్గించేందుకు ఈ జపమాల వాడవచ్చు. సెల్ ఫోన్ స్టాండ్ తయారుచేశామన్నారు. ఇంటి ఆవరణలో ఆవుపేడతో తయారుచేసిన ముఖద్వారం వద్ద గణపతులను వాడాలన్నారు. ద్వారబంధాలు కూడా తయారుచేశారు. ఆవుపేడలో లక్ష్మీ నివాసం వుంటుంది. దీపావళికి లక్ష్మీపూజ చేసేవారికి గోమయ లక్ష్మీ విగ్రహాలు అందుబాటులోకి తెచ్చామన్నారు.