Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
How to Remove Pilling from Woolen Clothes at Home: చలికాలం వచ్చిందంటే చాలు.. అల్మారాలో దాచిపెట్టిన వెచ్చని స్వెటర్లు, బ్రాండెడ్ కోట్లు, బ్లేజర్లు బయటకు తీస్తుంటాం. చలికి తట్టుకోవడానికి, అలాగే లుక్ పరంగానూ ఇవి చాలా గ్రాండ్‌గా కనిపిస్తాయి. అయితే ఎంత అందమైన, ఖరీదైన ఊలు దుస్తులైనా సరే.. కొద్దిరోజులు వాడగానే లేదా ఉతకగానే వాటిపై చిన్న చిన్న రోమాలు, ఉండలు (బబుల్స్) ఊడిపడతాయి. దీనివల్ల ఆ కొత్త బట్టలు కాస్త పాతబడిపోయినట్లు, చూడటానికి బొద్దుగా, అసహ్యంగా తయారవుతాయి. కొన్నిసార్లు ఈ రోమాల గోల తట్టుకోలేక ఇష్టమైన స్వెటర్లను పక్కన పడేస్తుంటాం లేదా వాటిని క్లీన్ చేయడానికి డ్రై క్లీనింగ్, ఫ్యాబ్రిక్ షేవర్లు అంటూ అనవసరంగా డబ్బులు దండగ చేస్తుంటాం. కానీ ఎలాంటి ఖర్చు లేకుండా, కేవలం రెండు నిమిషాల్లో మన ఇంట్లో లభించే సాధారణ వస్తువులతోనే ఈ రోమాలను సులభంగా వదిలించుకోవచ్చని మీకు తెలుసా?
ఈ సింపుల్ ట్రిక్స్ కోసం మనకి ఇంట్లో సాధారణంగా ఉండే షేవింగ్ రేజర్, పియుమిస్ స్టోన్ (పాదాలు రుద్దే రాయి), డక్ట్ టేప్ లేదా వెల్క్రో స్ట్రిప్, పాత్రలు తోమే స్పాంజ్ (పైన గరుకుగా ఉండే స్క్రచ్ బ్రైట్), అలాగే సన్నని పళ్ళు ఉన్న దువ్వెన ఉంటే చాలు. వీటిని ఉపయోగించి బట్టలపై ఉన్న రోమాలను ఎలా క్లీన్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా అందరికంటే ఎక్కువ రిజల్ట్ ఇచ్చేది షేవింగ్ రేజర్ హ్యాక్. మీ స్వెటర్ లేదా కోట్‌ను మంచం మీద కానీ, టేబుల్ మీద కానీ సమాంతరంగా పరవండి. ఒక చేత్తో గుడ్డను గట్టిగా పట్టుకుని, మరో చేత్తో పదునైన షేవింగ్ రేజర్‌ను పైనుంచి కిందకు చాలా తేలిగ్గా జరపండి. ఇలా చేస్తే క్షణాల్లో ఆ రోమాలన్నీ తెగిపోయి, మీ బట్టలు మళ్ళీ షోరూమ్‌లో కొన్నంత కొత్తగా మెరిసిపోతాయి.
Also Read
- Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
- Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
- Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
- Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
ఒకవేళ బట్టలపై రోమాలు చాలా తక్కువగా ఉన్నట్లయితే డక్ట్ టేప్ ట్రిక్ బాగా పనిచేస్తుంది. ప్యాకింగ్ టేప్‌ను గమ్ ఉండే వైపు బయటకు వచ్చేలా చేతికి చుట్టుకుని, స్వెటర్‌పై మెల్లగా తడుముతూ (ట్యాప్ చేస్తూ) రాబట్టాలి. దీనివల్ల ఆ రోమాలు, చిన్న చిన్న దారాలు టేప్‌కు అంటుకుని వచ్చేస్తాయి. అలాగే పాదాల మురికి తీయడానికి వాడే పియుమిస్ స్టోన్‌తో కూడా ఊలు దుస్తులను క్లీన్ చేయవచ్చు. ఈ రాయిని స్వెటర్ లేదా కోట్ మీద ఒకే దిశలో మెల్లగా రుద్దితే, దాని గరుకు ఉపరితలం వల్ల బయటకు వచ్చిన రోమాలన్నీ ఈజీగా ఊడిపోతాయి. ఇక సన్నని పళ్ళున్న ప్లాస్టిక్ దువ్వెనతో కూడా ఈ పనిని పూర్తి చేయవచ్చు. స్వెటర్‌ను సమాంతరంగా పరిచి దువ్వెనతో తేలికగా దింపితే, ఆ ఉండలన్నీ దువ్వెన పళ్ళలో చిక్కుకుని బయటకు వచ్చేస్తాయి. కేవలం రోమాలు తీసేయడమే కాదు, అసలు బట్టలపై రోమాలు రాకుండా చూసుకోవడం కూడా ముఖ్యం. అందుకోసం ఉతికే సమయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. వేడి దుస్తులను ఉతికేటప్పుడు ఎప్పుడూ లోపలి వైపును బయటకు తిరగేసి (ఉల్టా చేసి) మాత్రమే ఉతకాలి. అలాగే వీటిని వాషింగ్ మెషీన్లో వేయడం కన్నా, లిక్విడ్ డిటర్జెంట్ ఉపయోగించి చేత్తో ఉతకడమే చాలా మంచిది. ఒకవేళ మెషీన్లో ఉతకాల్సి వస్తే మాత్రం తప్పకుండా ‘జెంటిల్’ లేదా ‘వూలెన్’ మోడ్‌నే ఎంచుకోవాలి. దీనివల్ల బట్టల మధ్య ఘర్షణ తగ్గి, రోమాలు రాకుండా దుస్తులు ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి.
తాజావార్తలు
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
PM Modi: ‘పాలసీ పారాలసిస్’ నుంచి ‘రిఫార్మ్ ఎక్స్‌ప్రెస్’ వరకు.. దేశాభివృద్ధిపై మోడీ కీలక వ్యాఖ్యలు..
-
PM Modi: “2047 నాటికి ‘వికసిత భారతే లక్ష్యం.. We Will Do It..” దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..!
-
Farmer Marriage Struggles: ఎకరాల కొద్ది భూమి ఉన్నా.. నాకు పెళ్లి కావడం లేదు.. సీఎం దగ్గరకు వెళ్లిన యువ రైతు
-
jailer 2 : జైలర్2 నిండా స్టార్ కాస్ట్ నింపేసిన నెల్సన్ దిలీప్ కుమార్..
ట్రెండింగ్
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!