Site icon NTV Telugu

నెవర్ బిఫోర్ రికార్డులు సెట్ చేస్తున్న మహేష్ ఫ్యాన్స్

Dookudu Special Show on the occasion of Completing A Decade

సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు నెవర్ బిఫోర్ రికార్డులు సెట్ ఛీ పనిలో పడ్డారు. మహేష్ బాబు నటించిన ఇండస్ట్రీ హిట్ మూవీ “దూకుడు” విడుదలై నేటితో పదేళ్లు పూర్తవుతోంది. ఈ సినిమాకి శ్రీను వైట్ల దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ 23, 2011న విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల సునామీని సృష్టించి ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలు కొట్టిన “దూకుడు” దశాబ్దం పూర్తి చేసుకున్న సందర్భంగా సూపర్ స్టార్ అభిమానులు #DecadeForIHDookudu అనే హ్యాష్ ట్యాగ్ ను సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తూ “దూకుడు” విజయాన్ని, జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు.

Read also : అఫిషియల్ : మంచు విష్ణు “మా” ప్యానల్

మహేష్ బాబు క్రేజ్ దృష్ట్యా రెండు తెలుగు రాష్ట్రాలలోని వివిధ ప్రదేశాలలో “దూకుడు” స్పెషల్ షోలను ప్రదర్శించబోతున్నారు. బెంగుళూరులో కూడా ప్రత్యేక షోను ప్లాన్ చేశారు. ఈ ప్రత్యేక షోలకు సూపర్ స్టార్ అభిమానుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. చాలా చోట్ల ఆన్‌లైన్‌లో టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. కొద్ది క్షణాల్లోనే థియేటర్లు హౌస్ ఫుల్స్‌ గా మారాయి.

దూకుడు” స్పెషల్ షోల జాబితా (సెప్టెంబర్ 23):
హైదరాబాద్
సుదర్శన్ 35MM – 9:00 PM

విజయవాడ
అన్నపూర్ణ – 7:30 PM

వైజాగ్
శరత్ – 6:30 PM

కాకినాడ
సి & సి – 7:30 PM

నెల్లూరు
సిరి – 6:30 PM
సిరి (స్క్రీన్ 4) – 6:30 PM

అనంతపురం
శాంతి – 6:00 PM

రాజమండ్రి
సూర్య ప్యాలెస్ – 8:30 PM

నంద్యాల
శ్రీరామ – 7:00 PM

భీమవరం
పద్మాలయ మినీ – 8:00 PM

నరసింహాపురం
కనకదుర్గ – 6:30 PM

ఖమ్మం
వినోద – 9:00 PM

కడప
ప్రతాప్ – 9:00 PM

కొవ్వూరు
అనన్య – 6:00 PM

బెంగళూరు
అంజన్ – 6:00 PM

తిరుపతి
కృష్ణ తేజ – 6:30 PM

ప్రొద్దుటూరు
అర్చన – 6:30 PM

ఒంగోలు
గోరంట్ల – 7:30 PM

కర్నూలు
శ్రీరామ – 9:00 PM

శ్రీకాకుళం
మారుతి – 6:00 PM

Exit mobile version