Site icon NTV Telugu

Kissing Street: ఆ గల్లీకి వెళ్తే ముద్దులే ముద్దులు.. ఈ కిస్సింగ్ స్ట్రీట్‌ ఎక్కడో తెలుసా..?

Kissing Street

Kissing Street

మీరు ఎప్పుడైనా మెక్సికో నగరానికి వెళ్తే మాత్రం అక్కడున్న గువానాజువాటోకు తప్పకుండా వెళ్లండి.. ఒంటరిగా మాత్రం కాదు.. మీ భాగస్వామితోనో, మీ లవర్ తోనో వెళ్లండి.. వెళ్లిన తర్వాత కిస్‌స్ట్రీట్‌ను చుట్టేసి రండి. అక్కడికి వెళ్లిన వారు ముద్దు ముద్దులు పెట్టుకోకుండా వెనక్కి తిరిగిరారు. అందుకే జీవితంలో ఒక్కసారైనా ఆ ఏరియాకు వెళ్లి ముద్దులు పెట్టుకోవాలని లవ్ జంటలు అనుకుంటున్నారు. అదో సంప్రదాయమో, ఆచారమో కాదు.. కేవలం ఓ నమ్మకం మాత్రమే..

Read Also: Kamal Hassan: కమల్ హాసన్ని ఒక రేంజ్లో లేపుతున్నారు..కానీ అసలు విషయం ఇదా?

ఆ నమ్మకంతోనే చాలా జంటలు ఇక్కడకొచ్చి కిస్‌ స్ట్రీట్‌ దగ్గర క్యూలో నిలబడుతారు. చాలా ఇరుకైన గల్లీ ఇది. కేవలం ఒక జంట మాత్రమే అందులోకి వెళ్లే అవకాశం ఉంటుంది. అందుకే అన్నమాట జంటలు క్యూలు కడతారు. ఒక జంట తర్వాత మరొక జంట ఈ గల్లీలోకి వెళ్తుంది. అక్కడ ముద్దులు పెట్టుకుని వెనక్కి వచ్చేస్తుంది. అన్నట్టు ఈ కిస్‌ స్ట్రీట్‌ను ఎలో ఆఫ్‌ ది కిస్‌ అని కూడా అంటారు. ఈ ఇరుకైన సందుకు సంబంధించి ఓ విషాదకరమైనలవ్ స్టోరీ ఉంది.

Read Also: Naga Statues: కృష్ణానదిలో నాగదేవత విగ్రహాలు.. ప్రతిమలు ఎలా వచ్చాయని ఆరా

ఓ అమ్మాయ ఓ అబ్బాయి గాఢంగా లవ్ చేసుకున్నారు. ఇందులో ప్రేమికురాలు మాత్రం బాగా ధనవంతుల అమ్మాయి.. ప్రియుడేమో పేదవాడు. అయినా తోటరాముడు, రాజకుమారిలా వీరు ప్రేమించుకున్నారు. రహస్యంగా ఇక్కడికి వచ్చి కిస్‌ చేసుకునేవారంట. అయితే అమ్మాయి ఇంట్లో వాళ్లు వీరి ప్రేమపై కోపంతో అమ్మాయిని అనేక రకాలుగా కట్టడి చేశారు. అయినా ఈ స్ట్రీట్‌కు వచ్చి ప్రియుడిని కలుసుకునేది. దీంతో కుటుంబసభ్యులు ఆమెను హత్య చేశారు.. ఫలితంగా ఆ ప్రేమ అక్కడితో క్లోజో అయింది. అయితే వారి ప్రేమను కలకాలం బత్రికించడం కోసం వేల జంటలు ఇక్కడికి వచ్చి ముద్దులు పెట్టుకుంటుంటాయి. ఈ గల్లీలో ముద్దు పెట్టుకునే జంటల మధ్య ప్రేమ పెరుగుతుందని స్థానికులు చెబుతున్నారు.

Exit mobile version