NTV Telugu Site icon

Viral: వెడ్డింగ్ రిసెప్షన్‌లో నవ దంపతుల స్టంట్.. వణికిపోయిన అతిథులు..!

Fire Stunt

Fire Stunt

కొత్త ఒక వింత .. పాత ఒక రోత.. అన్నట్టుగా ఏది చేసిన కొత్తగా చేయడంపై ఫోకస్‌ పెడుతోంది యూత్‌.. జీవితంలో ముఖ్య ఘట్టమైన పెళ్లిళ్లలోనూ కొత్త తరహా ఆలోచనలు చేస్తున్నారు.. కొత్త స్టంట్లు చేసి ప్రాణాలమీదకు తెచ్చుకున్నవారు కూడా లేకపోలేదు.. తాజాగా, ఓ జంట.. తమ వెడ్డింగ్‌ రిసెప్షన్‌లో చేసిన స్టంట్‌లో ఒక్కసారిగా.. అక్కడున్న అతినిథులు వణికిపోయేలా చేసింది.. నవ వధూవరులు చేసిన ఫైర్ స్టంట్‌తో కొందరు ఏకంగా పరుగులే పెట్టారట.

వెడ్డింగ్‌ రిసెప్షన్‌లో జరిగిన ఆ ఫైర్‌ స్టంట్‌కు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గేబ్‌ జెస్సోప్‌-అంబీర్ అనే ఆ కొత్త జంట ప్రొఫెషనల్ స్టంట్ మాస్టర్స్ గా పనిచేస్తున్నారు.. వారి వివాహ వేడుకలనోనూ ఓ వినూత్నమైన స్టంట్‌ చేయాలని నిర్ణయానికి వచ్చారు.. ఫైర్‌ స్టంట్‌ అయితే కొత్తగా ఉంటుందని భావించారట.. దీంతో, అదే స్టంట్‌ చేశారు.. ఇక, ఆ వేడుకలో స్టంట్‌ ప్రారంభించే ముందు ఇద్దరూ ఒకరి చేయి ఒకరు పట్టుకుని నిలుచొని ఉండగా.. ఇంతలో ఓ వ్యక్తి అంబిర్ కుడి చేతిలో పట్టుకున్న ఫ్లవర్ బొకేకి నిప్పుపెట్టాడు.. దీంతో, క్షణాల్లో ఆ మంటలు వధూవరుల వీపు భాగంలోకి వ్యాపించాయి.. మొదట కొంత దూరం నడుస్తూ ముందుకుసాగిన ఆ జంట.. ఆ తర్వాత మెల్లగా పరుగులు పెట్టింది.. ఆ తర్వాత ఒకచోట మోకాళ్లపై కూర్చుండిపోయారు.. ఆ వెంటనే మరో ఇద్దరు వచ్చి మంటలార్పేశారు.. వారికి మంటలు అంటుకోవడం.. కొత్త జంట పరుగులు పెట్టడాన్ని చూసి.. వేడుకకు హాజరైన అతిథులు కొందరు వారికి ఉత్సాహపరిస్తే.. మరికొందరు వణికిపోయారట..

ఇక, ఆ దృశ్యాలను వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ క్యాప్చర్ చేసి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయగా… ప్రస్తుతం ఆ ఫైర్‌ స్టంట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.. పెళ్లిలో ఇదేం స్టంట్‌రా బాబు అంటూ కొందరు కామెంట్లు పెడుతుంటే.. మరికొందరు.. పెళ్లికూతురు, పెళ్లి కొడుకు సాహసంపై ప్రశంసలు కురిపిస్తున్నారు.