అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధం అయ్యింది.. రాముడి ప్రాణ ప్రతిష్ఠ కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు.. ఈరోజు అయోధ్య రామమందిరప్రాణ ప్రతిష్ట సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ అయోధ్య కు బయలు దేరారు… ఒక్కరోజు ముందుగానే అయోధ్య కు బయలు దేరారు చిరంజీవి, రామ్‌చరణ్. ఈ సందర్భంగా ఈ ఇద్దరు అభిమానులను కలిశారు. తమని చూసేందుకు భారీగా అభిమానులు తరలి రావడంతో వాళ్లు బయటకు వచ్చి అభిమానులకు అభివాదం తెలిపారు.. రామ్ చరణ్, చిరంజీవి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
చిరంజీవి, రామ్‌చరణ్ ఇద్దరు బయటకు వచ్చి ఫ్యాన్స్ కి అభివాదం తెలియజేయడంతోపాటు వారితో కాసేపు గడిపారు. వారి అభిమానికి ముగ్దులయ్యారు. వారితో కాసేపు ఉండి అలరించారు.. ఈ సందర్బంగా రామ్ చరణ్ కు అభిమానులు ప్రత్యేకంగా రూపొందించిన హనుమాన్ విగ్రహాన్ని బహూకరించారు. తమిళనాడులోని తంజావూరులో ప్రసిద్ధ శిల్పి అమర్‌నాథ్ రూపొందించిన 3 అడుగుల కాంస్య విగ్రహం మెగా అభిమానులకు మరియు వారి ప్రియమైన స్టార్‌కి మధ్య ఉన్న ఆధ్యాత్మిక సంబంధానికి ప్రతీక..
అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి ఈరోజు భారీగా ప్రముఖులు ఈ వేడుకకి హాజరు కాబోతున్నారు. తెలుగు నుంచి చిరంజీవి, రామ్‌చరణ్‌తోపాటు ప్రభాస్, పవన్ వంటి వారు హాజరు కాబోతున్నట్టు తెలుస్తుంది.. ఇక మెగాస్టార్ సినిమాల విషయానికొస్తే.. విశ్వంభర` చిత్రంలో నటిస్తున్నారు. వశిష్ట దర్శకత్వం వహిస్తున్న మూవీ ఇది. మైథలాజికల్ అంశాలతో తెరకెక్కుతుంది. మరోవైపు రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ చిత్రంలో నటిస్తుంది. శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు.. ఈ రెండు సినిమాలు ఈ ఏడాదిలోనే విడుదల కాబోతున్నాయి..