ఆనంద్ మహేంద్ర గురించి అందరికీ తెలుసు. వ్యాపారస్తుడిగా ఎంత సక్సెస్ అయ్యారో, సోషల్ మీడియాలో కూడా నిత్యం అందరికి ఉపయోగపడే పోస్టులు పెడుతూ యమా బిజీగా ఉంటున్నాడు. నిత్యం వ్యాయామాలు చేయడం ఆయన జీవనంలో ఒకభాగం. అయితే, ఆదివారం వచ్చిందని కొంతమంది వ్యాయామానికి బద్దకిస్తుంటారు. అలాంటి వారికోసం ఆనంద్ మహేంద్ర అదిరిపోయే చిట్కాను చెప్పాడు. ఆదివారం రోజున వ్యాయామం చేయకపోయినా, ఈ వీడియో చూస్తే సరిపోతుందని చమత్కరిస్తూ, సున్నితంగా హెచ్చరిస్తూ ఓ వీడియోను పోస్ట్ చేశారు.
Read: బిగ్‌బాస్ సీజన్ 5 లోగో విడుదల
ఈ వీడియోలో కొంతమంది అథ్లెట్స్ జిమ్మాస్టిక్స్ చేస్తున్నారు. వారు ఎంత ఫిట్‌గా లేకుంటే అంత ఫ్లెక్సిబుల్ గా బాడినీ గాల్లోకి జంప్ చేయించగలుగుతారు. ఫిజికిల్‌గా ఫిట్‌గా ఉంటూనే, మెంటల్‌గా కూడా ఫిట్‌గా ఉండాలని అప్పుడే లైఫ్‌ను బ్యాలెన్స్ చేస్తూ హ్యాపీగా లీడ్ చెయ్యెచ్చని ఆనంద్ మహేంద్ర హెచ్చరించారు. ప్రస్తుతం ఆనంద్ మహేంద్రం షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
