Site icon NTV Telugu

Amazon Layoffs: అమెజాన్‌లో మళ్లీ ఊడుతున్న ఉద్యోగాలు..ఉద్యోగుల్లో టెన్షన్..

Amazon Jobs Latest

Amazon Jobs Latest

అధిక ద్రవ్యోల్బణం తో పాటు మరి కొన్ని కారణాల వల్ల కొన్ని మేజర్ కంపెనీలు ఉద్యోగులను తీసేస్తున్నారు.. వివిధ విభాగాల్లోని లేఆఫ్స్ ప్రకటిస్తున్నాయి. తాజాగా ఈకామర్స్ దిగ్గజం అమెజాన్, మరోసారి లేఆఫ్స్‌కు తెరలేపింది. ఈసారి ఫార్మసీ బిజినెస్ యూనిట్‌లో కొంతమంది ఉద్యోగులను తొలగించింది. తాజా రౌండ్ లేఆఫ్‌లో 80 మంది ఉద్యోగులను తొలగించినట్లు ఓ రిపోర్ట్ పేర్కొంది. ఈ జాబితాలో ప్రధానంగా ఫార్మసీ టెక్నీషియన్స్, టీమ్ లీడ్స్ ఉన్నారు. అయితే రిజిస్టర్ అయిన ఫార్మసిస్ట్‌లను కంపెనీ తొలగించలేదని సమాచారం..

ఈ విషయం పై అమెజాన్ ప్రతినిధి మాట్లాడుతూ.. క్వాలిటీ, సామర్థ్యం కోసం మా ప్రాసెస్‌ను నిరంతరం మెరుగుపర్చుకుంటాం. తద్వారా బెస్ట్ కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ కోసం కృషి చేస్తాం. తాజాగా అమెజాన్ ఫార్మసీ విభాగంలో కొంతమంది ఉద్యోగులను తొలగించాం. వనరులను సర్దుబాటు చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నాం. అని వెల్లడించారు.. అమెజాన్ జనవరిలో కూడా కొంతమంది ఉద్యోగులను తొలగించిన విషయం తెలిసిందే.. ప్రధానంగా ప్రోగ్రామ్ మేనేజర్స్, రిస్క్ కంప్లయన్స్ మేనేజర్స్, బిల్లింగ్ మేనేజర్స్ వంటి జాబ్ రోల్స్‌లో పని చేస్తున్న ఉద్యోగులను ఎక్కువ సంఖ్యలో తొలగించారు. ఈ ప్రభావం డిజిటల్ హెల్త్ టూల్స్, హాలో హెల్త్, ఫిట్‌నెస్ ట్రాకర్‌లపై పనిచేస్తున్న ఉద్యోగులపై కూడా పడింది…

ఆ తర్వాత మరో 9000 ఉద్యోగులను తొలగించింది. ఈ ఏడాది మేలో మరో 500 మంది ఉద్యోగులకు పింక్ స్లిప్ జారీ చేసింది. ఈ ప్రభావం అమెజాన్ వెబ్ సర్వీసెస్ , హ్యూమన్ రిసోర్స్ అండ్ సపోర్ట్ ఫంక్షన్స్ విభాగంలోని ఉద్యోగులపై పడింది. తాజాగా మరోసారి ఫార్మసీ డివిజన్‌లోనూ లేఆఫ్స్ ప్రకటించడం గమనార్హం.. ఇకపోతే మరో దిగ్గజ కంపెనీ మైక్రోసాఫ్ట్ కంపెనీ కూడా తాజాగా మరోసారి లేఆఫ్స్‌ ప్రకటిస్తున్న కంపెనీల జాబితాలో అమెజాన్‌తో పాటు మరికొన్ని బడా సంస్థలు ఉన్నట్లు సమాచారం. అమెరికా టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఇటీవల 275 మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపింది. గతంలో కూడా ఉద్యోగులను తొలగించిన విషయం తెలిసిందే.. రాబోయే రోజుల్లోనూ ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ ఉంటుందని మైక్రోసాఫ్ట్ స్పష్టం చేసింది. ఇదే విధంగా మరికొన్ని కంపెనీలు కూడా ఉద్యోగాలను తొలగించనున్నారని సమాచారం..

Exit mobile version