NTV Telugu Site icon

Amalapaul : బర్త్ డే రోజు అమాలాపాల్ కు పెళ్లి ప్రపోజల్.. హీరోయిన్ ఏం చేసిందంటే?

Amalaa

Amalaa

హీరోయిన్ అమలాపాల్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. తెలుగులో కొన్ని సినిమాల్లో నటించింది.. అల్లు అర్జున్ తో ఇద్దరు అమ్మాయిలతో సినిమా బాగా పేరును తీసుకుంది.. భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.. ఆ తర్వాత వరుస సినిమా అవకాశాలు వచ్చినా పెద్దగా ప్రేక్షకుకాను ఆకట్టుకోలేక పోయాయి.. కొన్నాళ్లు తెలుగులో మెరిసిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత తమిళంలో వరుస లు చేసింది. కొన్నాళ్లకు ప్రేమ, పెళ్లి, అంతలోనే విడాకులు తీసుకోవడంతో అమలా పాల్ వార్తలలో నిలిచింది. డివోర్స్ తర్వాత అమలా పాల్ ఇప్పటివరకు సింగిల్‏గానే ఉంటుంది. ఆ మధ్యన అమలా పాల్ ప్రేమలో ఉందంటూ వచ్చాయి. పంజాబీ సింగర్‏తో ప్రేమలో ఉందని.. ఇద్దరికి పెళ్లై పోయిందంటూ కొన్ని ఫోటోస్ నెట్టింట చక్కర్లు కొట్టాయి..

ఆ ఫోటోలు కేవలం ఒక యాడ్ కోసమే అని తేలింది.. ఇక ఇప్పుడు వెబ్ సిరీస్ లు చేస్తూ బిజీగా ఉంది.. ఇక సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది.. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ వస్తుంది. అవి ఎంతగా వైరల్ అవుతున్నాయో నిత్యం మనం చూస్తూనే ఉన్నాం.. అయితే కొన్నాళ్లుగా సింగిల్‏గా ఉంటున్న అమలా పాల్.. ఇప్పుడు రెండో పెళ్ళి చేసుకునేందుకు రెడీ అయినట్లు ఓ వార్త నెట్టింట వినిపిస్తుంది…

నేడు ఈ అమ్మడు పుట్టినరోజు.. కాగా,బర్త్ డే సందర్భంగా పెళ్లి గురించి బయటపెట్టింది. ఆమె పుట్టిన రోజు వేడుకలను ఒక పబ్బులో సెలబ్రెట్ చేసిన తన స్నేహితుడు జగత్ దేశాయ్.. అదే సమయంలో పెళ్లి ప్రపోజల్ చేశారు. ఇక వెంటనే అమలా పాల్ సైతం ఓకే చెప్పారు. ఈ వీడియోను షేర్ చేస్తూ.. నా రాణి ఎస్ చెప్పింది.. త్వలోనే పెళ్లి చేసుకోబోతున్నాం అంటూ యాడ్ చేశారు.. అందులో ఎంత నిజం ఉందో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చెయ్యాల్సిందే.. అమలా ప్రపోజల్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..